Veera Simha Reddy Pre Release Business: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ - అఖండ రికార్డ్ బ్రేక్
Veera Simha Reddy Pre Release Business: బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా వీరసింహారెడ్డి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్షన్స్ రావాలంటే...
Veera Simha Reddy Pre Release Business: సుదీర్ఘ విరామం తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నందమూరి హీరో బాలకృష్ణ. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్నాడు.
అఖండ ఘన విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా ఇది. వీరసింహారెడ్డి రిలీజ్ కోసం చాలా రోజులుగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోండటంతో సినిమాపై బజ్ భారీగా ఏర్పడింది. ఈ హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 76 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అత్యధికంగా నైజాం ఏరియాలో 22 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. సీడెడ్‌లో 15 కోట్లు, ఈస్ట్‌లో ఐదు కోట్లు, గుంటూర్‌లో ఆరు కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.
మొత్తంగా ఏపీ, తెలంగాణ ఏరియాల్లో కలిపి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు 66 కోట్లకు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. కర్ణాటకలో ఏడు కోట్లు, ఓవర్‌సీస్‌లో మరో మూడు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది. ఓవరాల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 78 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలని సమాచారం. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే.
గత చిత్రం అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ 56 కోట్ల వరకు జరిగింది. అఖండ రికార్డ్‌ను వీరసింహారెడ్డి బ్రేక్ చేసింది. ఇందులో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా వీరసింహారెడ్డితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందించాడు.