Unstoppable 3: ఒకే వేదికపై చిరంజీవి, కేటీఆర్, బాలకృష్ణ.. టీడీపీని గెలిపించేందుకేనా?-balakrishna unstoppable season 3 will start soon and guest list here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Balakrishna Unstoppable Season 3 Will Start Soon And Guest List Here

Unstoppable 3: ఒకే వేదికపై చిరంజీవి, కేటీఆర్, బాలకృష్ణ.. టీడీపీని గెలిపించేందుకేనా?

Sanjiv Kumar HT Telugu
Sep 21, 2023 12:33 PM IST

Balakrishna Unstoppable 3: ఓటీటీ వేదికపై సంచలనం సృష్టించిన టాక్ షోలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ ఒకటి. ఇప్పటికీ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఒకే వేదికపై చిరంజీవి, కేటీఆర్, బాలకృష్ణ.. త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 3
ఒకే వేదికపై చిరంజీవి, కేటీఆర్, బాలకృష్ణ.. త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 3

నందమూరి నటసింహం సినిమాల్లో భారీ డైలాగ్స్, క్రేజీ ఫైట్స్ తో అదరగొడితే.. అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ఆయనలోని కొత్త కోణం బయటకు వచ్చింది. సినిమాల్లో కంటే చమత్కారం, కామెడీ టైమింగ్ ఈ టాక్ షోలో చూశాం. అందుకే ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారం అయిన అన్ స్టాపబుల్ సీజన్ 1, సీజన్ 2 సంచలన విజయం సాధించాయి.

ట్రెండింగ్ వార్తలు

అన్ స్టాపబుల్ 3కి ప్లాన్

ఇక అన్ స్టాపబుల్ సీజన్‍ 2ను నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‍తో ప్రారంభించగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో ముగించారు. ఫస్ట్ ఎపిసోడ్‍‍కు తీవ్రమైన కాంట్రవర్సీ ఎదురుకాగా.. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. భారీ స్థాయిలో ఆల్ టైమ్ వ్యూస్ తెచ్చుకుంది. ఇప్పుడు త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 3ని ప్రారంభించేందుకు ఆహా ప్లాన్ చేస్తోందని ఓ టాక్ వినిపిస్తోంది.

టాప్ పొలిటిషియన్స్

ప్రస్తుత రాజకీయాలు, సినిమా షెడ్యూల్స్ తో బాలయ్యకు టైమ్ లేకున్నా అన్ స్టాపబుల్ సీజన్ 3ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ సీజన్‍లో ఎక్కువగా సినీ సెలబ్రిటీల కంటే రాజకీయ ప్రముఖులను అతిథులుగా రంగంలోకి దించనున్నారట. కేటీఆర్, మెగాస్టర్ చిరంజీవి, పురంధేశ్వరి వంటి టాప్ పొలిటిషియన్స్ ను పిలిపించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

అధికారంలోకి

ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్యతో ఒకే వేదికపై చిరంజీవి, కేటీఆర్ కనిపిస్తే అటు రాజకీయంగా, ఇటు సినిమా పరంగా సంచలనం అవుతుంది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తన హోస్టింగ్ ద్వారా టీడీపీని మళ్లీ అధికారంలోకి రాబట్టే ఛాన్స్ ఉన్నాయని బాలయ్యకు పలువురు సలహా ఇవ్వడంతో టైమ్ లేకున్నా షోని హోస్ట్ చేసేందుకు ఒప్పుకున్నారట.

ఆ సినిమాకు బ్రేక్

అందుకే వీలైనంత త్వరగా అన్ స్టాపబుల్ సీజన్ 3ని ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీతో చేయాల్సిన సినిమాకు బ్రేక్ ఇచ్చారట. ఎందుకంటే బాలయ్య ప్రస్తుతం టీడీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.

మరో 6 నెలలు

ఇటీవల స్కిల్ డెవలప్‍మెంట్ స్కామ్‍లో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయాలపై బాలకృష్ణ ఫోకస్ పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఇటీవల బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్ వెళ్లి చూసి వచ్చారు. ఇలా రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తే ఆరు నెలల వరకు సమయం కేటాయించాలి. అందుకే బాబీతో సినిమాను ఆపేసి.. భగవంత్ కేసరి ఫినిష్ చేస్తారు. తర్వాత వెంటనే అన్ స్టాపబుల్ 3ని హోస్ట్ చేసేందుకు రెడీ అవుతారని సమాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.