Bhagavanth Kesari Live Updates: భగవంత్ కేసరి లైవ్ అప్డేట్స్.. ప్రీమియర్ కలెక్షన్స్ ఇవే!-balakrishna sreeleela bhagavanth kesari movie review and box office collections audience response live updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagavanth Kesari Live Updates: భగవంత్ కేసరి లైవ్ అప్డేట్స్.. ప్రీమియర్ కలెక్షన్స్ ఇవే!

భగవంత్ కేసరి లైవ్ అప్డేట్స్ అండ్ హైలెట్స్

Bhagavanth Kesari Live Updates: భగవంత్ కేసరి లైవ్ అప్డేట్స్.. ప్రీమియర్ కలెక్షన్స్ ఇవే!

Updated Oct 19, 2023 11:24 AM ISTUpdated Oct 19, 2023 11:24 AM IST
  • Share on Facebook
Updated Oct 19, 2023 11:24 AM IST
  • Share on Facebook

Bhagavanth Kesari Movie Live Updates: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎట్టకేలకు భారీ అంచనాలతో గురువారం థియేటర్‌లలో విడుదలైంది. భగవంత్ కేసరి లైవ్ అప్డేట్స్ చూస్తే..

Thu, 19 Oct 202306:44 AM IST

అమ్మాయిలు చూడాల్సిన సినిమా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ కమర్షియాలిటీతోపాటు మెసేజ్ ఒరియెంటేడ్ చిత్రమని అంటున్నారు. అమ్మాయిలు కచ్చితంగా చూసే సినిమాగా చెబుతున్నారు.

Thu, 19 Oct 202306:10 AM IST

ప్రీమియర్ కలెక్షన్స్

భగవంత్ కేసరి సినిమాకు యూకేలో ప్రీమియర్ షోస్ ద్వారా సుమారుగా 5 లక్షల డాలర్స్ మార్క్ ను చేరుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వర్కింగ్ డేలో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Thu, 19 Oct 202305:54 AM IST

మరిన్ని అవకాశాలు

భగవంత్ కేసరి సినిమాలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు. ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా. ఇందులో ఆయన నటనకు తెలుగు సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Thu, 19 Oct 202305:38 AM IST

ప్రభాస్ మేనియా

భగవంత్ కేసరి సినిమా ఆడుతున్న యూకే థియేటర్ లో ప్రభాస్ మేనియా సాగింది. సినిమా మధ్యలో సలార్ మూవీ టీజర్ వేసి ప్రభాస్ ఫ్యాన్సుకు ట్రీట్ ఇచ్చారు ఆ థియేటర్ నిర్వాహకులు. దీంతో థియేటర్ అంతా అరుపులు కేకలతో హోరెత్తింది.

Thu, 19 Oct 202305:22 AM IST

గుడ్ టచ్-బ్యాడ్ టచ్

భగవంత్ కేసరి సినిమా మంచి మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రమని నెటిజన్లు అంటున్నారు. అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో చెప్పే చిత్రమని చెబుతున్నారు.

Thu, 19 Oct 202305:01 AM IST

తిరుమలలో తమన్

తాజాగా తిరుమలను దర్శించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. భగవంత్ కేసరి సినిమా విడుదల సందర్భంగా తిరుమలకు తమన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా భగవంత్ కేసరి సినిమాలో తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని టాక్ వస్తోంది.

Thu, 19 Oct 202304:35 AM IST

యెల్లో ఫీవర్

భగవంత్ కేసరి సినిమాకు హిట్ టాక్ వస్తోంది. దీంతో అభిమానుల కోలహాలం ఎక్కువైంది. ఓ థియేటర్ వద్ద పసుపు రంగు వెదజల్లుతూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. దీంతో అక్కడ యెల్లో ఫీవర్ కనిపించింది.

Thu, 19 Oct 202304:17 AM IST

మందుతో అభిషేకం

భగవంత్ కేసరి మూవీ థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సందడి బాగా నెలకొంది. ఓ థియేటర్ వద్ద బాలయ్య కటౌట్ కి మ్యాన్షన్ హౌజ్ మందుతో అభిషేకం చేశారు ఫ్యాన్స్. ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

Thu, 19 Oct 202303:53 AM IST

ఫ్యాన్స్ సంబురాలు

భగవంత్ కేసరి బెన్ఫిట్ షో తర్వాత అభిమానులు టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. సినిమా బాగుందన్న సంతోషంలో ఈ వేడుక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో గింగిరాలు తిరుగుతోంది.

Thu, 19 Oct 202303:46 AM IST

క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్

భగవంత్ కేసరి మూవీలోని క్లైమాక్స్ సీన్ నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా ఉంది. బాలయ్య బాబు, శ్రీలీల ఎనర్జీ డ్రింక్ తాగుతూ.. చేతులతో సైగ, నోటితో చేసిన సౌండ్ చాలా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Thu, 19 Oct 202303:35 AM IST

కేసీపీడీకి కొత్త అర్థం

సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన కేసీపీడీ పదానికి భగవంత్ కేసరి టైపులో కొత్త అర్థం ఇచ్చారు నెటిజన్స్. K- కేసరి, C- చిచ్చా, P- పండుగ D- దావత్ అంటూ ట్విటర్ లో వైరల్ చేస్తున్నారు.

Thu, 19 Oct 202303:25 AM IST

పోలీసుగా బాలయ్య

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పోలీసుగా మరో పాత్ర చేశాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Thu, 19 Oct 202303:17 AM IST

కాజల్ కనిపించిన సమయం

భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కాకుండా కేవలం సైడ్ రోల్ చేసిందని అంటున్నారు. ఎందుకంటే ఆమె ఫస్టాఫ్ లో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించిందట.

Thu, 19 Oct 202303:15 AM IST

కంఫర్ట్ జోన్ నుంచి బయటకు

బాలయ్య తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. ఇలాంటి కథలకు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. బాలకృష్ణ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా భగవంత్ కేసరిని ఊహించుకోవద్దు. ఇది వాటన్నికంటే భిన్నంగా చాలా బాగుంది. సినిమాకు పండుగ కలిసి వస్తుంది అని ఒక నెటిజన్ ట్విటర్ లో పేర్కొన్నాడు.

Thu, 19 Oct 202303:08 AM IST

వర్త్ వర్మ.. వర్త్..

భగవంత్ కేసరి సినిమాలో ఎంట్రీ సీన్ నుంచి కొత్త బాలయ్యను చూస్తారని పలువురు అంటున్నారు. టెడ్డీ బాయ్ ఇరగదీసాడు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయని, సినిమాటోగ్రఫీ వేరే లెవెల్.. వర్త్ వర్మ.. వర్త్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Thu, 19 Oct 202302:17 AM IST

ఆ పాత్ర సూట్ కాలేదట

భగవంత్ కేసరి సినిమాలో ఎన్నడూ చూడని అవతారంలో బాలకృష్ణ కనిపించాడు. అలాగే మొదటిసారి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు. అయితే సినిమాలో పది నిమిషాల పాటు ఉండే పోలీస్ పాత్ర బాలయ్యకు సూట్ కాలేదని టాక్ వస్తోంది.

Thu, 19 Oct 202301:52 AM IST

గుడి కడతామంటూ

అఖండ, వీర సింహా రెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత చేసిన బాలకృష్ణ చేసిన మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు బాలకృష్ణ చూస్తున్నాడు. అయితే, ఈ మూవీకి ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ పడగా.. బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ వస్తోంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి గుడి కడతామంటూ ఫ్యాన్స్ అంటున్నారు.