బిగ్‍బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బిగ్‍బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీ ఉంది. ఈ తరుణంలో రీసెంట్‍గా ఓ రూమర్ బలంగా వినిపించింది. బిగ్‍బాస్ట్ 9 హోస్ట్‌గా గాడ్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వస్తారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కింగ్ నాగార్జున కంటిన్యూ కారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ బయటికి వచ్చింది.
బిగ్‍బాస్ట్ హోస్ట్‌గా నాగార్జునే కొనసాగుతారని, సీజన్ 9కు కూడా ఆయనే ఉంటారని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఈ సీజన్‍కు బాలకృష్ణ హోస్ట్‌గా ఉండడం లేదని పేర్కొంది. నెక్స్ట్ సీజన్ కోసం నాగార్జున సైన్ కూడా చేశారని తమకు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. దీన్ని బట్టి నాగార్జునే బిగ్‍బాస్ తెలుగు 9వ సీజన్‍కు కూడా కంటిన్యూ అవుతారనే క్లారిటీ వచ్చేసింది.
అన్‍స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీ స్పేస్‍లోనూ బాలకృష్ణ తన మార్క్ చూపించారు. దీంతో బిగ్‍బాస్‍కు హోస్ట్‌గా 9వ సీజన్‍లో నాగార్జున స్థానాన్ని బాలయ్య భర్తీ చేయనున్నారంటూ రూమర్లు తెగ వచ్చేశాయి. అయితే, నాగార్జునే కొనసాగించాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. మరి ఇది ఇలానే ఉంటుందా.. మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఎదురవుతుందా అనేది చూడాలి.
బిగ్‍బాస్ తెలుగు 9వ సీజన్‍ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించేలా టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. నాగార్జున ఆరు సీజన్లుగా ఈ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. దీంతో కొత్త హీరోను తీసుకొస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ నాగ్ కంటిన్యూ కావడం దాదాపు ఖాయమైందని సమాచారం.
బిగ్‍బాస్ సీజన్ 8లో కొందరు కంటెస్టెంట్లపై నాగార్జున పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు కూడా వినిపించాయి. పృథ్విరాజ్, నిఖిల్, విష్ణుప్రియకు అనుకూలంగా ఎక్కువగా వ్యవహరించారని, గౌతమ్ కృష్ణకు అన్యాయం చేశారంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. గతేడాది సీజన్ ముగిశాక కూడా కూడా కొన్ని రోజుల పాటు ఈ చర్చ సాగింది.
బిగ్‍బాస్ సీజన్ 8 విజేతగా టీవీ సీరియల్ యాక్టర్ నిఖిల్ మలియక్కల్ నిలిచారు. గౌతమ్ కృష్ణ రన్నరప్ అయ్యారు. నబీల్, ప్రేరణ, అవినాశ్ కూడా ఫైనల్స్ చేరారు. మరి రానున్న బిగ్‍బాస్ 9వ సీజన్‍లో కంటెస్టెంట్లుగా ఎవరూ ఉంటారోననే ఆసక్తి ఇప్పటి నుంచే ఉంది.
సంబంధిత కథనం