Balakrishna Remuneration: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలకృష్ణ.. ఇప్పుడెంతో తెలుసా?
Balakrishna Remuneration: రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడు బాలకృష్ణ. హ్యాట్రిక్ సక్సెస్ లతో ఊపు మీదున్న బాలయ్య.. తన తర్వాతి సినిమా కోసం మరో రూ.10 కోట్లు ఎక్కువ తీసుకుంటున్నట్లు సమాచారం.
Balakrishna Remuneration: బాలకృష్ణ టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న సీనియర్ హీరో. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. నిజానికి తన కెరీర్లో చాలా వరకూ మినిమం గ్యారెంటీ హిట్స్ అందించిన బాలయ్య బాబు.. ఇప్పుడీ హ్యాట్రిక్ విజయాలతో తన రెమ్యునరేషన్ పెంచేయడం విశేషం.
బాలకృష్ణ తాజాగా తన తర్వాతి సినిమా కోసం ఏకంగా రూ.28 కోట్లు వసూలు చేస్తున్నాడట. బాబీ డైరెక్షన్ లో, నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య తన రెమ్యునరేషన్ రూ.10 కోట్లు పెంచేశాడు. తన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి కోసం అతడు రూ.18 కోట్లు వసూలు చేశాడు. అంతకుముందు వీరసింహా రెడ్డి కోసం అందుకున్న రెమ్యునరేషన్ కంటే ఇది రూ.4 కోట్లు ఎక్కువ.
ఇక అంతకుముందు హ్యాట్రిక్ విజయాల్లో మొదటిదైన అఖండ కోసం బాలయ్య రూ.10 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నాడు. ఒక్కో సినిమా హిట్ అవుతూ వెళ్తుండటంతో అందుకు తగినట్లే అతడు తన రెమ్యునరేషన్ పెంచుతూ వెళ్తున్నాడు. బాలకృష్ణ సినిమాలు కొన్నాళ్లుగా ఓవరాల్ గా అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్, ఇతర ఆదాయాలతో కలిపి కనీసం రూ.150 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి.
ఆ లెక్కన చూస్తే అతని రెమ్యునరేషన్ మరీ అంత భారీగా ఉందని చెప్పలేం. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లోని సీనియర్ నటుల్లో అధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న సీనియర్ నటుల్లో బాలయ్య స్థానం రెండు. మొదటి స్థానంలో మెగాస్టార చిరంజీవి ఉన్నాడు. చిరు ఇప్పటికీ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
ఇక వెంకటేశ్, నాగార్జునలాంటి వాళ్లు రూ.12 కోట్లు అందుకుంటుండగా.. మరో సీనియర్ రవితేజ రూ.24 కోట్ల వరకూ వసూలు చేస్తున్నాడు. రవితేజకు ధమాకా తప్ప ఈ మధ్య పెద్ద హిట్స్ లేవు. అయినా అతడు కూడా రెమ్యునరేషన్ పెంచుతున్నాడు. మరోవైపు బాలకృష్ణ చివరి మూడు సినిమాలు రూ.100 కోట్లకుపైనే వసూలు చేయడం విశేషం.