Unstoppable 4 OTT: నా సెట్స్‌లోకి రానివ్వను: రామ్‍చరణ్‍ను ఆటపట్టించిన బాలకృష్ణ.. ఇద్దరం సక్సెస్ కొడదామంటూ.. వీడియో-balakrishna fun talk with ram charan during unstoppable 4 aha ott talkshow episode shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable 4 Ott: నా సెట్స్‌లోకి రానివ్వను: రామ్‍చరణ్‍ను ఆటపట్టించిన బాలకృష్ణ.. ఇద్దరం సక్సెస్ కొడదామంటూ.. వీడియో

Unstoppable 4 OTT: నా సెట్స్‌లోకి రానివ్వను: రామ్‍చరణ్‍ను ఆటపట్టించిన బాలకృష్ణ.. ఇద్దరం సక్సెస్ కొడదామంటూ.. వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 31, 2024 12:44 PM IST

Unstoppable 4 OTT: బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ 4 టాక్ షోకు రామ్‍చరణ్ వచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు జరిగింది. చెర్రీని ఆహ్వానిస్తూ కాస్త ఆట పట్టించారు బాలయ్య. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Unstoppable 4 OTT: నా సెట్స్‌లోకి రానివ్వను: రామ్‍చరణ్‍ను ఆటపట్టించిన బాలకృష్ణ.. ఇద్దరం సక్సెస్ కొడదామంటూ.. వీడియో
Unstoppable 4 OTT: నా సెట్స్‌లోకి రానివ్వను: రామ్‍చరణ్‍ను ఆటపట్టించిన బాలకృష్ణ.. ఇద్దరం సక్సెస్ కొడదామంటూ.. వీడియో

నట సింహం నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ మధ్య ఈసారి బాక్సాఫీస్ పోటీ ఉండనుంది. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానుండగా.. రెండో రోజుల్లోనే జనవరి 12న బాలయ్య ‘డాకూ మహరాజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‍స్టాపబుల్ 4 టాక్ షోకు రామ్‍చరణ్ వచ్చారు. రామ్‍చరణ్ ఎపిసోడ్ షూటింగ్ నేడు (డిసెంబర్ 31) జరిగింది. చెర్రీని రిసీవ్ చేసుకున్న సమయంలో బాలయ్య సరదా చేశారు.

yearly horoscope entry point

నా సెట్స్‌లో అనుమతి లేదు

అన్‍స్టాపబుల్ షూటింగ్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‍కు రామ్‍చరణ్ వచ్చారు. బాలకృష్ణ బయటికి వచ్చి ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా చరణ్‍ను ఆట పట్టించారు బాలయ్య. చరణ్ దగ్గరికి వచ్చి “నా సెట్స్‌లోకి నీకు అనుమతి లేదు” అన్నారు. లోపలికి రానివ్వననేలా మాట్లాడారు. వేలు చూపిస్తూ బ్రో అన్నారు. చరణ్ నమస్కారం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. బ్రో స్టైల్‍లో ఇవన్నీ లేవంటూ కౌగిలించుకున్నారు బాలకృష్ణ. తన స్టైల్‍లో చెర్రీతో సరదా చేశారు. చేతులు కలిపి చరణ్‍తో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడారు. తన సినిమా ముచ్చట్లు చెప్పారు.

రెండు సక్సెస్ కావాలి

సంక్రాంతికి డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్ వస్తున్నాయ్ అని చరణ్ చేయి పట్టుకొని బాలకృష్ణ మంచి జోష్‍తో ఉన్నారు. రెండు చాలా సక్సెస్ కావాలని చెప్పారు. ఇండస్ట్రీకి మనం సక్సెస్ ఇవ్వాలని చరణ్‍తో చెప్పారు. మూడు పువ్వులు, ఆరుకాయల్లా ఇండస్ట్రీ ఉండాలని అన్నారు. తప్పకుండా అని చరణ్ అన్నారు. హీరో శర్వానంద్ కూడా ఈ ఎపిసోడ్‍లో కనిపించనున్నారని తెలుస్తోంది.

రామ్‍చరణ్ పాల్గొన్న అన్‍స్టాపపబుల్ 4 ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా త్వరలోనే ప్రకటించనుంది. డాకు మహరాజ్‍తో గేమ్ ఛేంజర్ అంటూ ఆహా ట్వీట్ చేసింది.

పండుగ రేసులో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా విడుదల కానుంది. ఈ చిత్రం జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే అన్‍స్టాపబుల్ షోకు వెంకటేశ్ వచ్చారు. ఈ ఎపిసోడ్ చాలా హిట్ అయింది. బాలయ్య, వెంకీ కలిసి చాలా సందడి చేశారు. ప్రేక్షకులను ఈ ఎపిసోడ్ విపరీతంగా ఆకట్టుకుంది.

గేమ్ ఛేంజర్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. డాకూ మహారాజ్ మూవీ హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఉండనుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని అనిల్ రావివూడి తెరకెక్కించారు.

Whats_app_banner