Tollywood: డ్యూయల్ రోల్ మూవీస్ హీరోలకే కాకుండా అభిమానులకు స్పెషల్‌గా ఉంటాయి. ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్ చేయడం, యాక్టింగ్, గెటప్, లుక్ పరంగా వేరియేషన్ చూపించడం హీరోలకు ఛాలెంజింగ్‌గా ఉంటుంది. తమ అభిమాన హీరోను ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్‌లో చూసే ఛాన్స్ అభిమానులకు లభిస్తుంది.
ఇదివరకు తెలుగులో డ్యూయల్ రోల్ మూవీస్ చాలా వచ్చేవి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు తరచుగా డ్యూయల్ రోల్ మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్త తగ్గుముఖం పట్టింది. ఆడపాదడపా నేటి స్టార్ హీరోలు డబుల్ రోల్స్‌లో కనిపిస్తోన్నారు.
తెలుగు సినీ చరిత్రలో సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా డ్యూయల్ రోల్ మూవీస్ చేశాడు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో 35కుపైగా సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ హీరో బ్రేక్ చేయలేకపోయాడు.
ఎన్టీఆర్ తర్వాత తెలుగులో ఎక్కువగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించిన హీరోగా బాలకృష్ణ రికార్డ్ నెలకొల్పాడు. బాలకృష్ణ ఇప్పటివరకు 18 సినిమాల్లో డబుల్ రోల్స్ చేశాడు. అపూర్వ సహోదరులు మూవీలో ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్‌లో బాలకృష్ణ కనిపించాడు. ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత రాముడు భీముడు, ఆదిత్య 369, పెద్దన్నయ్య, సింహా, లెజెండ్, అఖండ నుంచి వీరసింహారెడ్డి వరకు మొత్తం 18 మూవీస్‌లో రెండు పాత్రల్లో కనిపించాడు.
2012లో రిలీజైన అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్‌లో బాలకృష్ణ నటించాడు. బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద సక్సెస్‌గా నిలిచాయి. సమకాలీన హీరోల్లో ఎక్కువ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా బాలకృష్ణ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. చిరంజీవి తన కెరీర్‌లో ఏడు సినిమాల్లో డ్యూయల్ రోల్స్‌లో కనిపించాడు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో త్రిపాత్రాభినయంలో కనిపించాడు.
అంతే కాకుండా ఎన్టీఆర్, బాలకృష్ణ కలయికలో తెలుగులో 12 సినిమాలు వచ్చాయి. టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు కలిసి చేసిన తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్, బాలకృష్ణ నటించాడు. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ మొత్తం ఏడు సినిమాలు చేశాడు.
ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 109వ సినిమా ఇది. ఈ మూవీ తర్వాత అఖండ 2తో పాటు మరికొన్ని సినిమాలకు బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.