Balakrishna: కృష్ణదేవరాయ పాత్ర నుంచే డాకు మహారాజ్ పుట్టింది.. యానిమల్ రాకముందే ముందే తీసుకున్నాం.. బాలకృష్ణ కామెంట్స్-balakrishna comments on daaku maharaaj story born and bobby deol casting before animal in pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: కృష్ణదేవరాయ పాత్ర నుంచే డాకు మహారాజ్ పుట్టింది.. యానిమల్ రాకముందే ముందే తీసుకున్నాం.. బాలకృష్ణ కామెంట్స్

Balakrishna: కృష్ణదేవరాయ పాత్ర నుంచే డాకు మహారాజ్ పుట్టింది.. యానిమల్ రాకముందే ముందే తీసుకున్నాం.. బాలకృష్ణ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 12, 2025 10:19 AM IST

Balakrishna About Daaku Maharaaj Movie And Bobby Deol: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఇవాళ విడుదలైంది. డాకు మహారాజ్ మూవీకి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కృష్ణదేవరాయ పాత్ర నుంచే డాకు మహారాజ్ పుట్టింది.. యానిమల్ రాకముందే ముందే తీసుకున్నాం.. బాలకృష్ణ కామెంట్స్
కృష్ణదేవరాయ పాత్ర నుంచే డాకు మహారాజ్ పుట్టింది.. యానిమల్ రాకముందే ముందే తీసుకున్నాం.. బాలకృష్ణ కామెంట్స్

Balakrishna Daaku Maharaaj Pre Release Event: 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జనవరి 12) గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

yearly horoscope entry point

అయితే, డాకు మహారాజ్ రిలీజ్‌కు రెండు రోజుల ముందు (జనవరి 10) ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఎంతో కలిచివేసింది

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది" అని అన్నారు.

"నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని బాలకృష్ణ తెలిపారు.

చిరస్థాయిగా నిలిచిపోయింది

"నాన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో 'ఆదిత్య 369'లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ 'డాకు మహారాజ్' కథ పుట్టింది" అని బాలయ్య చెప్పుకొచ్చారు.

"విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా, కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు" అని బాలయ్య పేర్కొన్నారు.

యానిమల్ రాకముందే

"ఎడిటర్స్ రూబెన్, నిరంజన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకట్ ఇలా టీమ్ అంతా మనసు పెట్టి పని చేశారు. ప్రతిభగల నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది" అని బాలకృష్ణ వెల్లడించారు.

"మూడు వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న 'డాకు మహారాజ్'తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తుంటాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న 'డాకు మహారాజ్' కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు" అని బాలయ్య తన స్పీచ్ ముగించారు.

Whats_app_banner

సంబంధిత కథనం