Balakrishna: కెమెరామెన్ అవ్వాలనుకున్నా.. నాన్న గారు చేయని పాత్ర చేశా.. బాలకృష్ణ కామెంట్స్-balakrishna comments in kajal agarwal satyabhama trailer launch and balakrishna about sr ntr narada role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: కెమెరామెన్ అవ్వాలనుకున్నా.. నాన్న గారు చేయని పాత్ర చేశా.. బాలకృష్ణ కామెంట్స్

Balakrishna: కెమెరామెన్ అవ్వాలనుకున్నా.. నాన్న గారు చేయని పాత్ర చేశా.. బాలకృష్ణ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Balakrishna In Kajal Agarwal Satyabhama Trailer Launch: కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నందమూరి నటసిహం బాలకృష్ణ. ఈ ఈవెంట్‌లో ఆయన ముందు కెమెరామెన్ అవుదామనుకున్నట్లు.. సీనియర్ ఎన్టీఆర్ చేయని పాత్ర తాను చేసినట్లు తెలిపారు.

కెమెరామెన్ అవ్వాలనుకున్నా.. నాన్న గారు చేయని పాత్ర చేశా.. బాలకృష్ణ కామెంట్స్

Balakrishna Sr NTR Kajal Agarwal Satyabhama: 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ సత్యభామ. హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. మేజర్ సినిమా (Majaor Movie) దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు.

క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల ఈ సత్యభామ సినిమాను తెరకెక్కించారు. జూన్ 7న సత్యభామ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం (మే 24) నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా సత్యభామ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్‌లో చూస్తున్నాను. సత్యభామ ట్రైలర్ లాంచ్‌కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది" అని నందమూరి నటసింహం బాలకృష్ణ చెప్పారు.

"సత్యభామ చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క.. అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. వీళ్లకు ప్రొడక్షన్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌లోనూ అనుభవం ఉంది. వీళ్లంతా కలిసి అవురమ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించడం. సినిమాలు నిర్మించడం సంతోషంగా ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నాను" అని బాలయ్య తెలిపారు.

"సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది సత్యభామ. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు వుమెన్ ఎంపవర్‌మెంట్‌కు ప్రతీకగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి ఎందరు భార్యలు ఉన్నా సత్య తన చెప్పుచేతల్లో ఆయనను పెట్టుకుంది. మహిళలు ఈ రోజు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందడటం సంతోషకరం" అని బాలకృష్ణ అన్నారు.

"భగవంత్ కేసరిలో (Bhagavanth Kesari Movie) నేను బనో బేటీకో షేర్ అని అంటే కాజల్ (Kajal Aggarwal) సత్యభామ సినిమాతో బనో కాచీకో షేర్ అంటూ ఫైట్స్ చేసింది. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. విష్ణు కెమెరా పనితనం బాగుంది. నేనూ మొదట్లో కెమెరామెన్ అవుదామని అనుకున్నా. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చాలా బాగుంది" అని బాలకృష్ణ పేర్కొన్నారు.

"తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉందంటే అందుకు కారణం మనకున్న మంచి ప్రేక్షకులు. ఈ రోజు నారద జయంతి. నాన్న గారు (Sr NTR) అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. ఒక్క నారదుడు తప్ప. నేను శ్రీనివాస కల్యాణం సినిమాలో నారదుడిగా నటించా. నాన్న గారు చేయని క్యారెక్టర్ ఒకటి నేను చేయడం సంతృప్తినిస్తుంటుంది" అని నందమూరి బాలకృష్ణ సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తెలిపారు.