Bhagavanth Kesari Twitter Review: భగవంత్ కేసరికి ఊహించని టాక్.. బాలయ్యకు అది సెట్ కాలేదు.. ఇంటర్వెల్ మైండ్ బ్లాక్
Bhagavanth Kesari Movie Twitter Review: నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి గురువారం (అక్టోబర్ 19) విడుదల కానుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. భగవంత్ కేసరి ట్విటర్ రివ్యూ లోకి వెళితే..

Balakrishna Bhagavanth Kesari Audience Review: అఖండ, వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. యాక్షన్ చిత్రాలకు కామెడీ జోడించి ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా సినిమాలను చిత్రీకరించే అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో బాలయ్యకు జోడీగా చందమామ కాజల్ నటించింది.
ఎన్నడూ చూడని విధంగా
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్ర పోషించింది. భగవంత్ కేసరి మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. అయితే ఎన్నడూ చూడని విధంగా ఇందులో బాలయ్య గెటప్, యాస ఉన్నాయి. మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడి బాలకృష్ణ ఆకట్టుకున్నాడు.
ఇక ఎట్టకేలకు భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 (గురువారం) విడుదల కానుంది. ఇప్పటికే యూఎస్ ఇతర చోట్ల ప్రీమియర్స్ షోలు పడ్డాయి. అవి చూసిన ఆడియెన్స్, నెటిజన్స్ భగవంత్ కేసరి మూవీపై ట్విటర్ వేదికగా అభిప్రాయం తెలుపుతున్నారు.
వాళ్లు కనెక్ట్ అవుతారు
"బాలయ్య తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు. ఇలాంటి కథలకు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. బాలకృష్ణ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా భగవంత్ కేసరిని ఊహించుకోవద్దు. ఇది వాటన్నికంటే భిన్నంగా చాలా బాగుంది. సినిమాకు పండుగ కలిసి వస్తుంది" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.
ఇంటర్వెల్ మైండ్ బ్లాక్
"భగవంత్ కేసరి సినిమా ఫస్ట్ హాఫ్‌కి 5కి 3 స్టార్ రేటింగ్. ఫస్ట్ హాఫ్‌లో కాజల్ అగర్వాల్ 15 నిమిషాల పాటు సైడ్ రోల్ చేసింది. ఇంటర్వెల్ మాత్రం మైండ్ బ్లాక్" అని ఒకతను తెలిపాడు. "భగవంత్ కేసరి హిట్ బొమ్మ. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీలో బాలకృష్ణను చాలా డిఫరెంట్‌గా చూస్తారు. కోకో కోలా పెప్సీ.. భగవంత్ కేసరి సెక్సీ" అని మనోజ్ అనే నెటిజన్ చెప్పుకొచ్చాడు.
బీజీఎమ్ అదిరిపోయింది
"భగవంత్ కేసరి ఈ మాటలు గుర్తు పెట్టుకోండి. సినిమా బ్లాక్ బస్టర్. ఎప్పుడూ చూడని అవతార్‌లో బాలయ్య కనిపించాడు. అనిల్ రావిపూడి హిట్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. సినిమా హిట్‌లో 50 శాతం సక్సెస్ క్రెడిట్ తమన్‌దే. బీజీఎమ్ అదిరిపోయింది" అంటూ కార్తీక్ అనే నెటిజన్ ఫైర్ ఎమోజీ షేర్ చేశాడు.
గుడి ఎక్కడ కట్టాలి
"నీకు గుడి ఎక్కడ కట్టాలో చెప్పు అనిల్ రావిపూడి. ఇంటర్వెల్‌కి స్టెరాయిడ్స్ రా కొడకల్లారా. ఎలివేట్ చేసేలా తమన్ బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కాజల్, బాలయ్య సీన్స్ సూపర్బ్. టైటిల్ సాంగ్‌కి గూస్ బంప్స్ వస్తాయి" అంటూ ఒకరు భగవంత్ కేసరి సినిమా అదిరిపోయిందని తెలిపాడు.
బాలయ్యకు సూట్ కాలేదు
"భగవంత్ కేసరి సినిమాలో కొత్తదనం ఏం లేదు. స్లో నెరేషన్‌తో మొదలు పెట్టి బిలో యావరేజ్‌గా ఫస్టాఫ్‌ను ముగించారు. ఒక పది నిమిషాల పోలీస్ రోల్ అతనికి (బాలకృష్ణకు) ఏమాత్రం సూట్ కాలేదు. కాజల్ అగర్వాల్ సీన్స్ చెత్తగా ఉన్నాయి. శ్రీలీల చాలా బాగా చేసింది. కానీ, మిగతా వారంతా మెచ్చుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేదు" అని ఒకరు రివ్యూ ఇచ్చారు.