Bhagavanth Kesari OTT: ఓటీటీలోకి భగవంత్ కేసరి.. కానీ, చాలా ఆలస్యంగా స్ట్రీమింగ్.. ఎందుకంటే?
Bhagavanth Kesari Digital Streaming: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తూనే కాస్తా నెగెటివిటీ వస్తోంది. ఇదిలా ఉంటే భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్ విషయాలు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి.
Bhagavanth Kesari OTT Platform: సరిలేరు నీకెవ్వరు, F2 సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఇందులో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. సినిమా మొదలైనప్పటి నుంచే ఎన్నో అంచనాలు పెరిగాయి. ఇక ట్రైలర్, సాంగ్స్ వాటికి మరింత హైప్ ఇచ్చాయి. ఎట్టకేలకు అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించేందుకు భగవంత్ కేసరి మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.

తెలంగాణ యాస, ఎప్పుడూ చూడని అవతారంలో నందమూరి నటిసింహం బాలకృష్ణను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అంతేకాకుండా పలు థియేటర్ల వద్ద బాలకృష్ణ కటౌట్‌లకు మ్యాన్షన్ హౌజ్ మందుతో అభిషేకం చేసి మరి తమ అభిమానం చాటుకున్నారు. అయితే, కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయంటే.. వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఆసక్తికరంగా చర్చ నడుస్తూ ఉంటుంది.
అలాగే, భగవంత్ కేసరి ఓటీటీ హక్కులు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన భగవంత్ కేసరి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని టైటిల్ కార్డులో తెలిసేలా చేసింది మూవీ యూనిట్. అయితే, సినిమాకు థియేట్రికల్ రైట్సుతోపాటు ఓటీటీ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ భగవంత్ కేసరి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది.
భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదలను మాత్రం చాలా ఆలస్యం చేయనుంది. సాధారణంగా థియేట్రికల్ సినిమాలు నెల రోజులకు ఓటీటీలకు వస్తాయి. కానీ, భగవంత్ కేసరి సినిమాను 50 రోజుల తర్వాతవిడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకుందట అమెజాన్ ప్రైమ్. అంటే, అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన భగవంత్ కేసరి మూవీ డిసెంబర్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం కనిపిస్తోంది.