Bhagavanth Kesari First Review: భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ.. ఈ ఏడాది బాలకృష్ణదే!
Bhagavanth Kesari Censor Review: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ మూవీపై సెన్సార్ సభ్యులు రివ్యూ ఇచ్చారు. ఆ వివవరాల్లోకి వెళితే..

Bhagavanth Kesari Censor Report: కామెడీ అండ్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన మూవీ భగవంత్ కేసరి. చందమామ కాజల్ అగర్వాల్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా ఆకట్టుకోనున్నాడు.
భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ
భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలి ట్రైలర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించింది. డైలాగ్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ తో నిండిపోయింది. భగవంత్ కేసరి మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.
సెన్సార్ సభ్యుల ప్రశంసలు
భగవంత్ కేసరి చిత్రాన్ని పెద్దలతో పాటు పిల్లలు కలిసి వెళ్లొచ్చని చూడొచ్చని సెన్సార్ సభ్యులు రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ వయెలెన్స్ మోతాదు మించలేదని అంటున్నారు. ఈ మూవీతో అనిల్ రావిపూడిలో కొత్త దర్శకుడిని చూశామని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు టాక్. ఇప్పటివరకు అనిల్ చిత్రాల్లో కామెడీ, ఎమోషన్స్ చూసిన ప్రేక్షకులు భగవంత్ కేసరితో కంటెంట్ ఉన్న డైరెక్టర్‌గా నిరూపించుకుంటారని అన్నారట.
పాజిటివ్‌గా క్రిటిక్
అంతేకాకుండా తనకు తానుగా సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు సైతం బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీపై పాజిటివ్‌గా స్పందించాడు. "భగవంత్ కేసరి సెన్సార్ స్క్రీనింగ్ పూర్తయింది. 2023 సంవత్సరం బాలకృష్ణదే" అని ఫైర్‌తో ఉన్న లవ్ సింబల్ ఎమోజీని షేర్ చేశాడు ఉమర్ సంధు. అంటే భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పకనే చెబుతున్నాడు ఈ దుబాయ్ బేస్డ్ సినీ క్రిటిక్.