Balakrishna: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీపడ్డ రెండు బాలకృష్ణ సినిమాలు - ఈ రేర్ రికార్డ్ నందమూరి హీరోదే?
Balakrishna: బాలకృష్ణ హీరోగా నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు థియేటర్లలో విడుదలయ్యాయి. వీటిలో బంగారు బుల్లోడు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవగా నిప్పురవ్వ మాత్రం డిజాస్టర్ అయ్యింది.
Balakrishna: ఓ స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం చాలా అరుదనే చెప్పుకోవాలి. అలాంటి అరుదైన రికార్డ్ బాలకృష్ణ కెరీర్‌లో నమోదైంది. బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు 1993 సెప్టెంబర్ 3న ఒకే రోజు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. బాలకృష్ణ మూవీతో మరో బాలకృష్ణ మూవీనే బాక్పాఫీస్ వద్ద పోటీపడింది. తెలుగులో స్టార్ హీరో నటించిన సినిమాలు ఒకే రిలీజ్ కావడం అన్నది బాలకృష్ణ కెరీర్‌లో మాత్రమే జరిగింది. ఈ రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవగా...నిప్పురవ్వ మాత్రం డిజాస్టర్ అయ్యింది.

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ...
బంగారు బుల్లోడు సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది.
రథ సారథి తర్వాత తెలుగులో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ నటించిన సెకండ్ మూవీ ఇది. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. ఈ సినిమా కోసం రాజ్‌కోటి స్వపపరచిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వాతిలో ముత్యమంత పాట పెద్ద హిట్టయింది.
విజయశాంతి కాంబోలో లాస్ట్ మూవీ...
బంగారు బుల్లోడు రిలీజైన అదే రోజు బాలకృష్ణ నిప్పురవ్వ కూడా విడుదలైంది. బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కోదండరామిరెడ్డి నిప్పురవ్వ మూవీని తెరకెక్కించాడు.
నిప్పురవ్వలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన పదిహేడవ మూవీ ఇది. ఇదే వారిద్దరు కలిసి చేసిన చివరి మూవీ కూడా కావడం గమనార్హం. నిప్పురవ్వ సినిమాలో తొలుత దివ్యభారతిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమె స్థానంలో విజయశాంతిని సెలెక్ట్ చేశారునిప్పురవ్వ మాత్రం బాక్సాఫీస్ బోల్తా పడింది.
షూటింగ్‌లో ప్రమాదం...
బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకోలేదు. నిప్పురవ్వ షూటింగ్‌లో ప్రమాదం జరిగి రిలీజ్ ఆలస్యమైంది. గనుల బ్యాక్‌డ్రాప్‌లో సీన్స్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ ముగ్గురు యూనిట్ సభ్యులు మృత్యువాతపడ్డారు. దాంతో ఏడాదిపాటు షూటింగ్ నిలిచిపోయింది. కోర్టు గొడవల సమసి చివరకు బంగారు బుల్లోడుతో పాటు ఒకే రోజు నిప్పురవ్వ కూడా రిలీజైంది. నిప్పురవ్వ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. బప్పిలహరి, రాజ్ - కోటితో పాటు ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ అందించాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్...
ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీతో ఓ మూవీ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బాలకృష్ణకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది.
గత ఏడాది భగవంత్ కేసరితో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 110 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా...శ్రీలీల కీలక పాత్ర పోషించింది.