Pawan Kalyan in Unstoppable: పవన్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ఘాటు వ్యాఖ్యలు.. ఊర కుక్కలతో పోల్చిన నటసింహం-balakrishna asked pawan kalyan about his marriages in unstoppable show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan In Unstoppable: పవన్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ఘాటు వ్యాఖ్యలు.. ఊర కుక్కలతో పోల్చిన నటసింహం

Pawan Kalyan in Unstoppable: పవన్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ఘాటు వ్యాఖ్యలు.. ఊర కుక్కలతో పోల్చిన నటసింహం

Maragani Govardhan HT Telugu
Feb 02, 2023 11:18 PM IST

Pawan Kalyan in Unstoppable: అన్‌స్టాపబుల్ సీజన్ 2 తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌ మొదటి భాగం గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ షోలో బాలయ్య.. పవర్‌స్టార్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలను అడిగారు.

బాలకృష్ణ-పవన్ కల్యాణ్
బాలకృష్ణ-పవన్ కల్యాణ్

Pawan Kalyan in Unstoppable: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ గురువారం రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వేదికగా ప్రసారమవుతోంది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు థియేటర్లలో స్పెషల్ షోలను సైతం ఎర్పాటు చేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఓ టాక్ షో ఎపిసోడ్‌కు ఇలా జరగడం ఇదే తొలిసారి. రెండు భాగాలుగా రానున్న ఈ ఎపిసోడ్ మొదటి భాగంలో పవన్ కల్యాణ్‌ను నందమూరి బాలకృష్ణ ఆసక్తికర ప్రశ్నలను అడిగారు.

గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బాలయ్య పంచుల నుంచి పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వరకు చాలా అంశాలను స్పృశించారు. ముందుగా బాలయ్య ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ పవన్ గురించి బండ్ల గణేశ్ చెప్పిన డైలాగుతో బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం అన్‌స్టాపబుల్‌లో బాలయ్య రెగ్యూలర్‌గా నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనస్సు అనే మాటను పవన్ కల్యాణ్ అన్నారు.

ఇలా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణల జరిగాయి. ఇందులో భాగంగా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి బాలయ్య ప్రశ్నించారు. ఇందుకు మన పవర్ స్టార్ తన సమాధానాన్ని స్పష్టంగా చెప్పారు. నా మీద ఎలాంటి ఆరోపణలు లేక పదే పదే ఇదే అంశాన్ని లేవనెత్తుతారని తెలిపారు. జీవితంలో వ్యక్తిగత జీవితంలో విభేదాలు వచ్చినప్పుడు వేరుగా ఉండటంలో తనకేమి నాకేమి అనిపించలేదని అన్నారు. ఒకరితో విడాకుల తర్వాత మరొకరిని చేసుకున్నాను తప్పా.. అందరితోనూ ఒకేసారి అఫైర్ నడిపించలేదని స్పష్టం చేశారు.

ఈ విషయంపై తనను అనేవారి వ్యక్తిగత జీవితం గురించి బాగా తెలుసని, కానీ సంస్కారం, విజ్ఞత అలా మాట్లాడించలేదని తెలిపారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు బాలయ్య కూడా సపోర్ట్ చేశారు. మూడు పెళ్లిళ్ల గురించి ఇకపై ఎవరైనా మాట్లాడితే వారు ఊరకుక్కలతో సమానమని స్పష్టం చేశారు.

వీరి మధ్య ఈ సంభాషణ ఆసక్తిగా సాగుతున్న తరుణంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య.. సరదాగా సాయి తేజ్‌ను ర్యాగ్ చేశారు. మీ మామయ్య మేనరిజాన్ని ప్రదర్శించాలని పట్టుబట్టారు. దీంతో చేసేదేమి లేక పవర్‌స్టార్ అనుమతితో సాయి తేజ్ ఆ మేనరిజాన్ని చూపుతారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ తన తొడగొట్టే మేనరిజాన్ని కూడా ప్రదర్శించమని కోరతారు. ఇందుకు సాయి .. నేను చేయలేనని ప్రాధేయపడతాడు. అయిన బాలయ్య పట్టు వదలకపోవడంతో చేసేదేమి లేక సాయి తేజ్ బాలయ్య దగ్గరకు వస్తుంటారు. నేను చెప్పింది నా తొడ కాదు.. నీ తొడ నువ్వు కొట్టమని చెప్పానని నవ్వులు పూయిస్తారు. అనంతరం సాయి తేజ్ కూడా బాలయ్య అనుమతితో తొడ గొట్టి అక్కడ నుంచి విశ్రమిస్తారు.

అనంతరం పవర్ స్టార్-బాలకృష్ణ మధ్య సంభాషణ మళ్లీ సాగింది. పవన్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలను బాలయ్య అడిగారు. తప్పు లేదా ఒప్పు ప్రశ్నలను సంధించారు. ఇందుకు పవన్ కూడా ఓపికగా సమాధానమిచ్చారు. అనంతరం పవన్ మనసు లోతుల్లో ఉన్న సంఘర్షణ గురించి బాలకృష్ణ అడుగుతారు. ఇందుకు పవర్ స్టార్‌ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెబుతారు. ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా చెప్పకముందే అంతటితో మొదటి భాగం నిలిపేస్తారు. త్వరలో రెండో ఎపిసోడ్‌లో మరికొన్ని ఆసక్తిర ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పారు. ఈ రెండో భాగం ఫిబ్రవరి 10 లేదా 17న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం