NBK 108 Movie Update: బాలయ్య-అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరే అప్డేట్.. మొదటి షెడ్యూల్ పూర్తి
NBK 108 Movie Update: బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.
NBK 108 Movie Update: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో మరోపక్క అన్‌స్టాపబుల్‌తో వ్యాఖ్యతగానూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం ఉంది. ఈ సినిమా పట్టాలపై ఉన్నప్పుడే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు బాలయ్య. తాజాగా NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది.
గాడ్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ.. అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్స్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో బాలకృష్ణపై మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ పోరాటాలను వెంకట్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ షెడ్యూల్‌లో బాలయ్య-శరత్ కుమార్‌తో పాటు మరికొంతమంది ఆర్టిసులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ సెట్‌లోనే NBK108 యూనిట్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. హీరో బాలకృష్ణ చిత్రబృందంతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు తినిపించుకున్నారు.
షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడు పోషించని పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిల్ రావిపూడి తాలుకూ కామెండీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. బాలయ్య స్టార్‍డమ్‌ను దృష్టిలో ఉంచుకుని అనిల్ ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు.
ఈ చిత్రంలో శ్రీలీ కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటీ, నటులు, సాంకేతి నిపుణులు పనిచేస్తున్నారు. సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. 2023లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
సంబంధిత కథనం