Akhanda Hindi collections Day 1: హిందీలో అఖండ విడుదల.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?-balakrishna akhanda hindi day 1 expected collections in world wide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Akhanda Hindi Day 1 Expected Collections In World Wide

Akhanda Hindi collections Day 1: హిందీలో అఖండ విడుదల.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

Maragani Govardhan HT Telugu
Jan 21, 2023 07:40 AM IST

Akhanda Hindi collections Day 1: నందమూరి నటసింహం నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించింతో తెలిసిందే. తాజాగా ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ కలెక్షన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

అఖండ హిందీ కలెక్షన్లపై ఓ లుక్కేయండి
అఖండ హిందీ కలెక్షన్లపై ఓ లుక్కేయండి

Akhanda Hindi collections Day 1: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2021 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే అప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా తాజాగా ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తోంది. శుక్రవారం అఖండ హిందీ వెర్షన్‌ను విడుదల చేశారు మేకర్స్.

గతేడాది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 లాంటి హిందుత్వ వాదంతో రూపొందిన సినిమాలు నార్త్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. దీంతో శివతత్వం, హిందూ భావజాలంతో రూపొందిన అఖండ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఫలితంగా జనవరి 20న నార్త్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆడియెన్స్‌లో బజ్ ఏర్పడింది. అంతేకాకుండా రూ.99లకే ఈ మూవీ టికెట్‌ను విక్రయించారు.

ఘనంగా ఉత్తరాదిలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే లభించాయి. ఆక్యూపెన్సీ కూడా పెద్దగా కనిపించలేదు. తొలి రోజు ఈ సినిమాకు రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హిందీలో పెద్దగా పబ్లీసిటీ చేయకపోవడం వల్ల ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాలేదని సమాచారం. మౌత్ టాక్ పెరిగితే కానీ ఈ సినిమాకు భారీగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాలు కూడా మౌత్ టాక్ ఆధారంగానే వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.

అయితే నార్త్‌లో మొత్తం 500 పైగా స్క్రీన్లలో అఖండ సినిమాను విడుదల చేశారు. హిందీ బెల్టులో 400కి పైగా స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ముంబయిలో 72 థియేటర్లు, దిల్లీలో 163, హైదరాబాద్‌లో 25, అహ్మదాబాద్‌లో 49, చంఢీఘడ్‌లో 30, పూణెలో 19, కోల్‌కతాలో 38, జైపుర్‌లో 27, భోపాల్‌లో 1, సూరత్‌లో 13. లక్నోలో 46, డెహ్రాడూన్‌లో 7 థియేటర్లలో విడుదల చేశారు. మొత్తం 506 స్క్రీన్లలో అఖండ హిందీ వెర్షన్‌ను విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. పగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. 2021 డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.120 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం