Daaku Maharaj HD Leak: షాకింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ హెచ్‍డీ వెర్షన్ లీక్-balakrishna action drama movie daaku maharaj hd rip version leaked on online before ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daaku Maharaj Hd Leak: షాకింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ హెచ్‍డీ వెర్షన్ లీక్

Daaku Maharaj HD Leak: షాకింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ హెచ్‍డీ వెర్షన్ లీక్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 01, 2025 01:20 PM IST

Daaku Maharaj HD Leak: డాకు మహారాజ్ సినిమాకు లీకుల బెదడ తగిలింది. ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే ఆ రేంజ్‍లో హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది.

Daaku Maharaj HD Leak: షాకింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ హెచ్‍డీ వెర్షన్ లీక్
Daaku Maharaj HD Leak: షాకింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ హెచ్‍డీ వెర్షన్ లీక్

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించింది. ఈ యాక్షన్ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. అయితే, ఈలోగానే ఓటీటీ ప్రింట్‍లా హెచ్‍డీ వెర్షన్ లీక్ అయింది.

yearly horoscope entry point

ఆన్‍లైన్‍లో లీక్

డాకు మహారాజ్ చిత్రం హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది. మూవీ రిలీజయ్యాక ఈ మూవీ లీక్ కాగా.. ఇప్పుడు తాజాగా మరో హెచ్‍డీ ప్రింట్ వెర్షన్ పైరసీ సైట్లలో కనిపిస్తోంది. ఏకంగా ఓటీటీల్లో ఉండే లాంటి ప్రింట్ లీకైపోయింది. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే హెచ్‍డీ వెర్షన్ వచ్చేయడం షాకింగ్‍గా మారింది.

ఇటీవలి కాలంలో హెచ్‍డీ వెర్షన్‍ల లీక్ బెడద పెరిగిపోతోంది. పుష్ప 2, గేమ్ ఛేంజర్ చిత్రాల హెచ్‍డీ వెర్షన్‍లు కూడా ఆన్‍లైన్‍లో బయటికి వచ్చేశాయి. ఇప్పుడు డాకు మహారాజ్ చిత్రానికి కూడా హెచ్‍డీ వెర్షన్ లీక్ దెబ్బ పడింది. లీక్‍లను అడ్డుకునేందుకు మూవీ టీమ్ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలనే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

డాకు మాహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ తేవాలని ఆ ఓటీటీ ప్లాన్ చేసుకుంటోందని రూమర్లు వస్తున్నాయి. ఈ తరుణంలో హెచ్‍డీ ప్రింట్ ఆన్‍లైన్‍లో లీకవడం అవాక్కయ్యేలా చేస్తోంది.

డాకు మహారాజ్ సూపర్ హిట్

డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపింది. తొలి వీకెండ్‍లోనే రూ.100 కోట్లు అధిగమించింది. సాలిడ్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. అయితే, వరుసగా నాలుగోసారి రూ.100కోట్ల చిత్రాన్ని బాలయ్య నమోదు చేశారు. సూపర్ బాక్సాఫీస్ ఫామ్ కొనసాగించారు.

డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణతో పాటు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్యమైన పాత్రలు చేశారు. చాందినీ చౌదరి, షైన్ టామ్ చాకో, ఊర్వశి రౌతేలా, మకరంద్ దేశ్‍పాండే కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య ఈ మూవీని నిర్మించారు.

Whats_app_banner

సంబంధిత కథనం