Balagam OTT Release Date: బలగం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరి కొద్ది గంటల్లోనే..-balagam ott release date announced as the movie to stream in amazon prime video
Telugu News  /  Entertainment  /  Balagam Ott Release Date Announced As The Movie To Stream In Amazon Prime Video
బలగం మూవీ
బలగం మూవీ

Balagam OTT Release Date: బలగం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరి కొద్ది గంటల్లోనే..

23 March 2023, 16:38 ISTHari Prasad S
23 March 2023, 16:38 IST

Balagam OTT Release Date: బలగం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరి కొద్ది గంటల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Balagam OTT Release Date: టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ మూవీ బలగం. చాలా తక్కువ బడ్జెట్ తో ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని సక్సెస్ సాధించింది. ఈ సినిమా తొలి వారంలోనే నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ సాధించి పెట్టడం విశేషం.

ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే అప్పుడే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బలగం మూవీ గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవనుంది. థియేటర్లలో మంచి టాక్ సంపాదించి దూసుకెళ్తున్న ఈ సినిమా ఇంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతుందని ప్రేక్షకులు అంచనా వేయలేదు. మార్చి 3నే ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది.

ఈ సినిమా తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. చాలా తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో తొలి నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లిందీ మూవీ. కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన తొలి మూవీ ఈ బలగం. ప్రియదర్శి హీరోగా నటించాడు.

బలగం కథేంటంటే..

కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య ఉండే అపోహ‌లు, అపార్థాలు, వాటిని హీరో ప‌రిష్క‌రించే క‌థ‌ల‌తో గ‌తంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. బ‌ల‌గం కోర్ పాయింట్ అదే అయినా చావు చుట్టూ ఈ క‌థ‌ను న‌డిపించి తొలి సినిమాతోనే వైవిధ్య‌త‌ను చాటుకున్నాడు ద‌ర్శ‌కుడు వేణు టిల్లు. ఈ సెన్సిటివ్ పాయింట్ నుంచి కామెడీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని ర‌కాల ఎమోష‌న్స్ చ‌క్క‌గా రాబ‌ట్టుకున్నాడు.

ఈ ఎమోష‌న్స్‌కు స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ సంస్కృతుల్ని, సంప్ర‌దాయాల్ని జోడించి స‌హ‌జంగా బ‌ల‌గం సినిమాను తెర‌కెక్కించాడు. చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డి ఆప్తుల‌కు దూరం కావ‌డం స‌రికాద‌ని, క‌లిసి ఉండ‌టంలోనే సంతోషం ఇమిడి ఉంటుంద‌ని చాటిచెప్పారు.

అయిన‌వాళ్ల‌కు దూరంగా ప‌ల్లెల్లో ఒంట‌రిగా జీవితాల్ని గ‌డిపే త‌ల్లిదండ్రుల మ‌నోవేద‌న‌ను హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. మ‌నుషులు దూర‌మైన‌ప్పుడే వారి విలువ తెలుస్తుంద‌ని, బ‌తికి ఉన్న‌ప్పుడే అయిన‌వాళ్ల‌ను ప్రేమ‌గా చూడ‌టంలోనే ప్రేమ‌, ఆప్యాయ‌త ఉంటాయ‌ని సినిమాలో ఆవిష్క‌రించారు.

సంబంధిత కథనం