ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). ఇవాళ 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాజమౌళికి సినీ సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి టీమ్ సరికొత్తగా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
రాజమౌళి యాక్టింగ్ చేసిన అరుదైన వీడియోను బాహుబలి టీమ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, నాజర్‌కు సన్నివేశాలను నటిస్తూ వివరించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అందులో హీరోలకు జక్కన్న ఎలా చేయాలో యాక్ట్ చేసి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బాహుబలి టీమ్ షేర్ చేసిన రాజమౌళి యాక్టింగ్ వీడియోకు "విజన్, ధైర్యం, ప్యాషన్.. మాహిష్మతి రాజ్యాన్ని ఊహించినటువంటి విజనరీ దర్శకుడికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు రాజమౌళి సర్" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అందులో దండం పెడుతున్న ఎమోజీ కూడా యాడ్ చేశారు. అలాగే, బాహుబలి ది ఎపిక్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఆ వీడియోలో రాజమౌళి యాక్టింగ్ చూసి నెటిజన్స్, అభిమానులు ఫిదా అవుతున్నారు. పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "హీరోలను సైతం తలదన్నేలా రాజమౌళి గారి నటన ఉంది" అంటూ ఓ అభిమాని రాసుకొచ్చారు.
అలాగే, "భారతదేశపు స్టీవెన్ స్పీల్ బర్గ్" అని మరొకరు వ్యాఖ్యానించారు. "జేమ్స్ కామెరాన్ ఎవరు" అని అభిమాని రాసుకొచ్చారు. "నటుల కంటే ఒక డైరెక్టర్ మెరుగ్గా నటిస్తే ఎలా ఉంటుందో చూపించారు. పర్ఫెక్షన్‌ను డిమాండ్ చేయడం కాదు చూపించారు. అదే రాజమౌళి పద్ధతి. అందుకే ఆయన సినిమాలు సజీవంగా నిలిచిపోతాయ్" మరొకరు చెప్పారు.
ఇలా కామెంట్స్, పొగడ్తలతో రాజమౌళి యాక్టింగ్ వీడియో తెగ వైరల్ అయిపోతుంది. నెటిజన్స్, అభిమానులు చెప్పినట్లుగానే రాజమౌళి యాక్టింగ్ చేసి చూపించిన విధానం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వివిధ పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్, ఎమోషన్స్‌తో నటించి చూపించిన రాజమౌళి బాహుబలి బీటీఎస్ వీడియో అట్రాక్ట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. రాజమౌళి బర్త్ డే సందర్భంగా మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేశ్ బాబు రాజమౌళి కలిసి ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం