OTT Web Series: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న మూడు వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో..!-bahishkarana nagendrans honeymoons and tribhuvan mishra ca web series to land this week on otts zee5 hotstar netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Web Series: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న మూడు వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో..!

OTT Web Series: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న మూడు వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో..!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 17, 2024 11:24 PM IST

OTT Web Series: ఈ వారం మూడు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు ఓటీటీల్లోకి రానున్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వస్తున్నాయి. ఈ సిరీస్‍ల స్ట్రీమింగ్ సహా మరిన్ని వివరాలు ఇవే.

OTT Web Series: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న మూడు వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో..
OTT Web Series: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న మూడు వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో..

ఓటీటీల్లో ఈ వారం కూడా కొన్ని వెబ్ సిరీస్‍లు అడుగుపెడుతున్నాయి. అయితే, వీటిలో మూడు సిరీస్‍లపై కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వస్తున్నట్టు ట్రైలర్ల ద్వారా తెలియడంతో ఈ సిరీస్‍లపై బజ్ ఏర్పడింది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ కూడా ఇదే వారంలో వస్తోంది. మరో రెండు సిరీస్‍లపై కూడా క్రేజ్ ఉంది. ఈ వారం ఓటీటీలోకి రానున్న మూడు ముఖ్యమైన వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

నాగేంద్రన్స్ హనీమూన్స్

నాగేందన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ జూలై 19వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఓ వ్యక్తి అబద్ధాలు చెప్పి ఐదు పెళ్లిళ్లు చేసుకోవడం అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది.

నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్‍లో సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్ర పోషించారు. కని కస్తూరి, శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ, రమేశ్ పిషరోడీ, కళాభవన్ షాజాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‍కు నితిన్ రెంజీ పనికర్ దర్శకత్వం వహించారు.

బహిష్కరణ

బహిష్కరణ తెలుగు వెబ్ సిరీస్ జూలై 19వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించారు. రూరల్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‍లో వేశ్య పాత్ర పోషించారు అంజలి. బహిష్కరణ ట్రైలర్ రస్టిక్‍గా ఇంట్రెస్టింగ్‍గా సాగింది.

బహిష్కరణ సిరీస్‍లో అంజలితో పాటు రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, చైతన్య సాగిరాజు కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు ముకేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‍కు సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించారు. బహిష్కరణ సిరీస్‍పై అంచనాలు బాగానే ఉన్నాయి. బహిష్కరణ సిరీస్‍ను జూలై 19 నుంచి జీ5లో చూడొచ్చు.

త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్

త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ వెబ్ సిరీస్ జూలై 18వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) అయిన త్రిభువన్ (మానవ్ కౌల్) ఓ మహిళా క్లైంట్‍తో శారీరక సంబంధం పెట్టుకొని చిక్కుల్లో పడే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‍ను చంపేందుకు గ్యాంగ్‍స్టర్ వెంటపడడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది.

త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ సిరీస్‍లో మానవ్ కౌల్‍తో పాటు తిలోత్తమ షోమ్, శ్వేత బసు ప్రసాద్, శుభ్రజ్యోతి బారత్, ఫైజల్ మాలిక్, జితిన్ గులాటీ, అశోక్ పాఠక్, నైనా సరీన్, సుమీత్ గులాటీ కీలకపాత్రలు పోషించారు. మీర్జాపూర్‌ సిరీస్ క్రియేటర్ పునీత్ కృష్ణనే ఈ సిరీస్‍కు పని చేశారు. త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ సిరీస్‍కు అమిత్ రాజ్ గుప్తా దర్శకత్వం చేశారు. క్రియేటర్‌తో పాటు షో రన్నర్ బాధ్యతను కూడా పునీత్ కృష్ణ నిర్వర్తించారు. మీర్జాపూర్ క్రియేటర్ నుంచి వస్తుండటంతో ఈ సిరీస్‍పై అంచనాలు బాగానే ఉన్నాయి. జూలై 18 నుంచి త్రిభువన్ మిశ్రా సిరీస్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించొచ్చు.

Whats_app_banner