OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. ఆ నాలుగు మిస్ అవకండి!-bahishkarana bold series to aadijeevitham nagendrans honeymoon this week ott movies web series netflix zee5 aha etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. ఆ నాలుగు మిస్ అవకండి!

OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. ఆ నాలుగు మిస్ అవకండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 15, 2024 10:12 PM IST

OTT Movies, Web Series This Week: ఈ వారం కూడా ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూ కడుతున్నాయి. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆడుజీవితం చిత్రం ఈ వారంలోనే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ బోల్డ్ వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి రానుంది.

OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. ఆ నాలుగు మిస్ అవకండి!
OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. ఆ నాలుగు మిస్ అవకండి!

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈ వారం (జూలై మూడో వారం) కూడా కొత్తగా సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేస్తున్నాయి. ఓటీటీల్లో కంటెంట్ చూడాలనుకునే వారికి పుష్కలంగా చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. సుమారు మూడు నెలలుగా ఎదురుచూస్తున్న బ్లాక్‍బస్టర్ ఆడుజీవితం చిత్రం ఈ వారంలోనే ఓటీటీలోకి వస్తోంది. తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ బహిష్కరణ కూడా రానుంది. మరిన్ని కూడా అడుగుపెట్టనున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

నెట్‍ఫ్లిక్స్

ఆడుజీవితం - ది గోట్‍లైఫ్: మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఆడుజీవితం - ది గోట్‍లైఫ్ చిత్రం జూలై 19వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆడుజీవితం జూలై 19న అందుబాటులోకి రానుంది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ అడ్వెంచర్ డ్రామా మూవీ మార్చి 28న థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయింది. ఎట్టకేలకు సుమారు నాలుగు నెలలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి జూలై 19న స్ట్రీమింగ్‍కు రానుంది.

  • టీపీ బన్ సీజన్ 2 - జపనీస్ యానిమ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - జూలై 17
  • ది గ్రీన్ గ్లవ్ గ్యాంగ్ సీజన్ 2 - పోలిష్ సిరీస్ -నెట్‍ఫ్లిక్స్ - జూలై 17
  • మాస్టర్ ఆఫ్ ది హౌస్ - థాయ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - జూలై 18
  • త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ - హిందీ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - జూలై 18
  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - ఇంగ్లిష్ మూవీ - నెట్‍ఫ్లిక్స్ - జూలై 19
  • ఫైండ్ మీ ఫాలింగ్ - ఇంగ్లిష్ సినిమా - నెట్‍ఫ్లిక్స్ - జూలై 19

జీ5

బహిష్కరణ వెబ్ సిరీస్: హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించిన బహిష్కరణ వెబ్ సిరీస్ జూలై 19వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ముకేశ్ ప్రజాపతి ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. అంజలి ఈ రివేంజ్ థ్రిల్లర్ సిరీస్‍లో వేశ్య పాత్ర చేశారు. జూలై 19 నుంచి బహిష్కరణ సిరీస్‍ను జీ5లో చూడొచ్చు.

బర్జాఖ్ - హిందీ సిరీస్ - జీ5 - జూలై 19

ఆహా

హరోం హర: సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ హరోం హర సినిమా నేడు (జూలై 15) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

హాట్‍స్పాట్ - తెలుగు డబ్బింగ్ సినిమా - ఆహా - జూలై 17

ఈటీవీ విన్

మ్యూజిక్‍షాప్ మూర్తి: సీనియర్ నటుడు అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రదాన పాత్రలు పోషించిన ఎమోషనల్ డ్రామా మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం జూలై 16వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది.

హరోం హర: హరోం హర చిత్రం ఈటీవీ విన్‍లో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. జూలై 18న ఈ ఓటీటీలో అడుగుపెట్టనుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో

మై స్పై ద ఎటర్నల్ సిటీ - ఇంగ్లిష్ సినిమా - జూలై 18

మనమే - తెలుగు సినిమా - జూలై 19 (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)

డిస్నీ+ హాట్‍స్టార్

నాగేంద్రన్స్ హనీమూన్ - మలయాళ సిరీస్ (తెలుగులోనూ) - జూలై 19

ఈ నాలుగు మిస్ చేయొద్దు!

ఈ వారం ఓటీటీలో ఆడుజీవితం చిత్రాన్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ అడ్వెంచర్ డ్రామా చిత్రం థియేటర్లలో హిట్ అవడంతో పాటు చాలా ప్రశంసలను దక్కించుకుంది. జూలై 19న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. అంజలి నటించిన రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. జీ5లో జూలై 19న స్ట్రీమింగ్‍కు రానున్న ఈ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉండే ఛాన్స్ ఉంది. హరోం హర చిత్రం ఇప్పటికే ఆహాలో అందుబాటులోకి వచ్చేయగా.. జూలై 18న ఈటీవీ విన్‍లో కూడా అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని కూడా ఓసారి చూడొచ్చు. మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రం కూడా ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాను జూలై 16 నుంచి ఈటీవీ విన్‍లో వీక్షించొచ్చు.

Whats_app_banner