బద్మాషులు రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ చేష్టలు.. తెలుగు కామెడీ సినిమా ఎలా ఉందంటే?-badmashulu movie review in telugu and rating telangana backdrop comedy drama film make you laugh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బద్మాషులు రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ చేష్టలు.. తెలుగు కామెడీ సినిమా ఎలా ఉందంటే?

బద్మాషులు రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ చేష్టలు.. తెలుగు కామెడీ సినిమా ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో కామెడీ డ్రామాగా వచ్చిన న్యూ తెలుగు మూవీ బద్మాషులు. శంకర్ చేకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విద్యా సాగర్, మహేష్ చింతల, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. బద్మాషులు మూవీ ఇవాళ (జూన్ 6) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి బద్మాషులు రివ్యూలో ఇక్కడ తెలుసుకుందాం.

బద్మాషులు రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ చేష్టలు.. తెలుగు కామెడీ సినిమా ఎలా ఉందంటే?

టైటిల్‌ : బద్మాషులు

నటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులు

దర్శకత్వం: శంకర్ చేగూరి

సంగీతం: తేజ కూనూరు

సినిమాటోగ్రఫీ: వినీత్ పబ్బతి

ఎడిటింగ్‌: గజ్జల రక్షిత్‌ కుమార్‌

నిర్మాతలు: బి. బాలకృష్ణ, సి. రామ శంకర్

విడుదల తేది: జూన్ 6, 2025

తెలుగులో ఇవాళ (జూన్ 6) థియేటర్లలో విడుదలైన సినిమా బద్మాషులు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఇద్దరి ఫ్రెండ్స్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా చిత్రం ఇది. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచి అంచనాల నడుమ ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి బద్మాషులు రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర్ తిరుపతి (మహేశ్‌ చింతల), బార్బర్ ముత్యాలు (విద్యాసాగర్‌ కారంపురి) ఇద్దరు మంచి స్నేహితులు. మధ్య వయస్కులైన వీరిద్దరికి తాగనిదే పూట గడవదు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఊరంతా వీరిని బద్మాషులు అని తిట్టిన పట్టనట్లు ఉంటారు.

ఓ రోజు తాగేందుకు డబ్బులు లేక స్కూల్ పెన్షిన్ వైర్ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోతారు. నాలుగు రోజుల తర్వాత విడిచిపెడతారు. ఈ క్రమంలోనే స్కూల్‌లో ఓ కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల సమాచారం ఉంటుంది. ఆ కంప్యూటర్ చోరీ కేసు కూడా తిరుపతి, ముత్యాలుపై పడుతుంది.

బద్మాషులు ట్విస్టులు

ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కంప్యూటర్ దొంగలించింది ఎవరు? ఆ కంప్యూటర్‌లో విద్యార్థుల డేటా కాకుండా ఇంకేముంది? అసలు దొంగను పట్టుకునేందుకు తిరుపతి, ముత్యాలుకు కానిస్టేబుల్ రామచందర్ (మురళీధర్ గౌడ్) చేసిన హెల్ప్ ఏంటీ? తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి కారణాలు ఏంటీ? వీరిలో మార్పు వచ్చిందా? చివరికి ఏం జరిగింది? అనేది తెలియాలంటే బద్మాషులు సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

బద్మాషులు అనే పదాన్ని తెలంగాణలో ఎక్కువగా వాడుతుంటారు. అల్లరిచిల్లరగా తిరుగుతూ ఇబ్బందిపెట్టేవాళ్లను బద్మాషులు అంటూ తిడుతుంటారు. ఈ తిట్టు పదంతో తెలుగులో కామెడీ డ్రామాగా తెరకెక్కిన బద్మాషులు మూవీ కూడా దానికి సూట్ అయ్యే ఇద్దరి ఫ్రెండ్స్ చుట్టూ సాగుతుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కామెడీ డ్రామా ఇది.

ఓ పల్లెటూరిలో బద్మాషులుగా ఇద్దరు ఫ్రెండ్స్ పేరు తెచ్చుకోవడం, తాగేందుకు ఏ పని అయినా వారు చేయడం, చివరికి వారు చేయని తప్పుకు కూడా అందరు నిందించడం, దాని నుంచి వీరు బయటపడటంతో వంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. తిరుపతి, ముత్యాలుతో పాటు ఈ సినిమాలోను ప్రతి పాత్ర నిజజీవితంతో మన ఊరిలో వారిలాగే ఉంటూ నవ్విస్తుంటాయి.

క్లైమాక్స్ అలా

కామెడీ ట్రాక్‌పై ఎక్కువ ఫోకస్ చేసిన డైరెక్టర్ చివరిలో మాత్రం మంచి సందేశం ఇచ్చారు. ఇక కొన్ని చోట్ల జాతి రత్నాలు టైమ్ సీన్స్ తారసపడుతుంటాయి. కథ దాదాపుగా అర్థమయ్యేసరికి కొన్ని సీన్లు సాగదీతల అనిపిస్తాయి. తాగేందుకు ముత్యాలు, తిరుపతి చేసే పనులు నవ్విస్తాయి. కొన్ని రొటీన్‌గా అనిపిస్తాయి. పోలీస్ స్టేషన్‌లో కామెడీ ట్రాక్ బాగుంది.

క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా నీట్‌గా ఫ్యామిలీ చూసేలా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్. బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్‌ తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్‌ ఈ చిత్రంతో హీరోగా మారాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. హావాభావాలతో నవ్వించాడు.

ఎవరెలా చేశారంటే

ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా మూవీస్ సినిమాలతోపాటు సత్తిగాని రెండెకరాలు, భామాకలాపం, సివరపల్లి ఓటీటీ సినిమాలు, సిరీస్‌లలో తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన మహేష్ చింతల ట్రైలర్‌ తిరుపతిగా ఆకట్టుకున్నాడు. సహజ నటనతో అలరించాడు. సినిమాలో వేసిన సింపుల్‌ పంచులు బాగా పేలాయి. విద్యా సాగర్, మహేష్ చింతల నిజమైన తాగుబోతులుగా స్క్రీన్‌పై కనిపించారు.

ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రల పరిధి తక్కువైనా మెప్పించారు. మురళీధర్‌ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డితో పాటు మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా మూవీ బాగుంది. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు.

ఫైనల్‌గా చెప్పాలంటే

వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్‌ కుమార్‌ ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీతో చూసే తాగుబోతుల కామెడీ మూవీ బద్మాషులు.

రేటింగ్: 2.5/5

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం