BMCM Twitter Review: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’కు టాక్ ఎలా ఉందంటే!-bade miyan chote miyan twitter review akshay kumar tiger shroff action movie getting mixed response from audience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bmcm Twitter Review: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’కు టాక్ ఎలా ఉందంటే!

BMCM Twitter Review: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’కు టాక్ ఎలా ఉందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 11, 2024 11:36 AM IST

Bade Miyan Chote Miyan (X) Twitter Review: బడే మియా చోటే మియా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీని చూసిన కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ చిత్రానికి టాక్ ఎలా ఉందంటే..

Bade Miyan Chote Miyan Twitter Review: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీకి టాక్ ఎలా ఉందంటే!
Bade Miyan Chote Miyan Twitter Review: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీకి టాక్ ఎలా ఉందంటే!

Bade Miyan Chote Miyan Audience Review: బడే మియా చోటే మియా (BMCM) సినిమా నేడు (ఏప్రిల్ 11) థియేటర్లలో రిలీజైంది. అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాలతో రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీలో విలన్‍గా నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తో ఈ చిత్రంపై హైప్ విపరీతంగా పెరిగింది. బడే మియా చోటే మిడా చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి టాక్ ఎలా ఉందంటే..

yearly horoscope entry point

యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నా..

బడే మియా చోటే మియా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్, యాక్టింగ్, వారిద్దరి కాంబో మెప్పిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా విలన్ పాత్ర పోషించిన పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి తన నటనతో మెరిపించారని చెబుతున్నారు. అయితే, ఈ సినిమా కథ మాత్రం కొత్తగా లేదని, కొన్నిచోట్ల యాక్షన్ సీన్లు మరీ ఓవర్ అయ్యాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

“బడే మియా చోటే మియా సినిమా కొన్ని భాగాల్లో బాగానే ఉన్నా.. కొత్తగా ఏమీ అనిపించదు. పాత స్టోరీ లైన్‍తోనే వచ్చింది. పృథ్విరాజ్ పాత్ర, కొన్నియాక్షన్ సీన్లతో పాటు అక్షయ్, టైగర్ మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్‍ప్లే ఊహించే విధంగానే సాగుతుంది. ఎమోషనల్ కనెక్ట్ లేదు. ఇలాంటి స్ట్రక్చర్‌నే చాలా సినిమాల్లో చూశాం కాబట్టి.. ఈ సినిమా చూస్తున్నప్పుడు కాసేపటి తర్వాత అలసట వస్తుంది. ఓవరాల్‍గా సోసో టైమ్‍పాస్‍గా ఉంది” అని వెంకీ రివ్యూస్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి యూజర్ పోస్ట్ చేశారు.

మరోవైపు, మరికొందరు బడే మియా చోటే మియాలో యాక్షన్‍తో పాటు కామెడీ కూడా బాగా పండిందని పోస్టులు చేస్తున్నారు. వన్ లైనర్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్‍ప్లే కూడా కుదిరిందని పోస్టులు చేస్తున్నారు. వీఎఫ్‍ఎక్స్, భారీతనం, సైన్స్ ఫిక్షన్ ఎలిమిమెంట్స్, పృథ్విరాజ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయని కొందరు పోస్టులు చేస్తున్నారు.

మొత్తంగా బడే మియా చోటే మియా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలే వస్తున్నాయి. కొందరు ఈ చిత్రంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు పాజిటివ్‍గా స్పందిస్తున్నారు. ఇక, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

బడే మియా చోటే మియా గురించి..

బడే మియా చోటే మియా సినిమాలో ఆర్మీ సైనికులు ఫిరోజ్‍ అలియాజ్ ఫ్రెడీగా అక్షయ్ కుమార్, రాకేశ్ అలియాజ్ రాకీగా టైగర్ ష్రాఫ్ నటించారు. ఇండియాకు నష్టం చేసేందుకు కబీర్ (పృథ్విరాజ్ సుకుమారన్) చేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఫ్రెడీ, రాకీ మిషన్ చేపడతారు. ఈ చిత్రంలో మానుషీ చిల్లర్, అలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రోణిత్ బోస్ రాయ్ కీలకపాత్రలు చేశారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షిక దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. జూలియస్ పకియమ్, విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందించారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదలైంది.

Whats_app_banner