Bade Miyan Chote Miyan OTT: ‘బడే మియా చోటే మియా’ ఓటీటీ పార్ట్‌నర్ ఇదే.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..
Bade Miyan Chote Miyan OTT Platform: బడే మియా చోటే మియా చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

Bade Miyan Chote Miyan OTT Platform: బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బడే మియా చోటే మియా’ థియేటర్లలోకి వచ్చేసింది. రంజాన్ సందర్భంగా నేడు (ఏప్రిల్ 11) ఈ చిత్రం విడుదలైంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ సీక్వెన్సులతో తెరకెక్కింది ఈ మూవీ. కాగా, బడే మియా చోటే మియా సినిమా ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు వెల్లడయ్యాయి.
స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్
బడే మియా చోటే మియా మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీకి పెద్ద మొత్తంలోనే ఆ ప్లాట్‍ఫామ్ చెల్లించిందని తెలుస్తోంది.
థియేట్రికల్ రన్ తర్వాత బడే మియా చోటే మియా సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఒకరోజు వాయిదాతో..
బడే మియా చోటే మియా సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. ముందుగా ఆ డేట్‍నే మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. అయితే, రంజాన్ పండుగ ఏప్రిల్ 11వ తేదీన ఉండటంతో ఈ మూవీ టీమ్ కూడా తేదీని మార్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. పండుగను అనుసరించి రిలీజ్ ప్లాన్‍లో మార్పు చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ ఈ చిత్రం నేడు విడుదలైంది.
భారీ బడ్జెట్‍తో..
బడే మియా చోటే మియా సినిమా భారీ బడ్జెట్‍తో రూపొందింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సుమారు రూ.350 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం బయటికి వచ్చింది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, పాటల కోసం టీమ్ భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఒక్కోసారి ఈ మూవీ షూటింగ్ కోసం రోజుకు రూ.4కోట్ల వరకు ఖర్చయ్యేదని కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ వెల్లడించారు. ఈ మూవీని పూజా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ పతాకాలపై జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించారు.
హైవోల్టేజ్ యాక్షన్, గ్రాండ్‍నెస్‍తో బడే మియా చోటే మియా సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీలో అక్షయ్, టైగర్‌తో పాటు మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, మానుషీ చిల్లర్, ఆలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రోణిత్ బోస్ రాయ్, మనీశ్ చోదరి , సాహబ్ అలీ, పవన్ చోప్రా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జూలియస్ పాకియమ్, విశాల్ మిశ్రా సంగీతం అందించారు.
అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించిన మైదాన్ సినిమా కూడా నేడు (ఏప్రిల్ 11) థియేటర్లలో రిలీజ్ అవుతోంది. భారత లెజెండరీ ఫుట్‍బాల్ కోచ్, హైదరాబాదీ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అమిత్ శర్మ. ఈ మూవీ ప్రియమణి కూడా కీలకపాత్ర పోషించారు.