Bade Miyan Chote Miyan Collections: రూ.350కోట్ల చిత్రానికి షాకింగ్ కలెక్షన్లు.. నాలుగు రోజుల్లో ఎంతంటే..
Bade Miyan Chote Miyan Box Office Collections: బడే మియా చోటే మియా సినిమాకు అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. నాలుగు రోజుల్లో ఈ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
Bade Miyan Chote Miyan Collections: హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బడే మియా చోటే మియా’ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఈ మూవీ ఈద్ సందర్భంగా ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ వచ్చింది. అయితే, బడే మియా చోటే మియా చిత్రానికి ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీకి అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టిందంటే..
నాలుగు రోజుల వసూళ్లు ఇవే..
బడే మియా చోటే మియా ఫస్ట్ వీకెండ్‍లో బాక్సాఫీస్ వద్ద ఆశించినంత జోరు చూపించలేదు. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.96.18 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. రూ.100 కోట్లకు సమీపించింది. అయితే, సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీకి ఈ వసూళ్లు తక్కువే. బాక్సాఫీస్ వద్ద అంచనాలను ఈ చిత్రం ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ వీకెండ్‍లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది.
గట్టెక్కడం కష్టమే!
బడే మియా చోటే మియా సినిమా బ్రేక్ఈవెన్ సాధించాలన్నా.. లాభాల్లోకి రావాలన్నా కలెక్షన్ల జోరు భారీగా పెరగాలి. అయితే, అది చాలా కష్టంగా కనిపిస్తోంది. తొలి వీకెండ్ నాలుగు రోజుల్లో ప్రతీ రోజు ఈ మూవీకి సుమారు రూ.20 కోట్ల రేంజ్‍లో వసూళ్లు వచ్చాయి. ఇక సోమవారమైన ఐదో రోజు నుంచి కలెక్షన్లు మళ్లీ తగ్గుతాయని బుకింగ్స్ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత వరకు వసూళ్లను రాబట్టగలదో చూడాలి.
బడే మియా చోటే మియా మూవీలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ సైనికులుగా నటించారు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ కుమారన్ విలన్‍గా చేశారు. ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. మానుషీ చిల్లర్, ఆలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రోణిత్ బోస్ రాయ్, మనీశ్ చోదరి , సాహబ్ అలీ కీరోల్స్ చేశారు.
బడే మియా చోటే మియా చిత్రాన్ని పూజ ఎంటర్‌టైన్‍మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ కలిసి ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సులకు భారీగా ఖర్చు చేసినట్టు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ కూడా చెప్పారు. ఈ చిత్రానికి దాదాపు రూ.350కోట్లు బడ్జెట్ అయినట్టు అంచనాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, జోర్డాన్‍లో ఎక్కువ శాతం షూటింగ్ చేశారు.
బడే మియా చోటే మియా మూవీకి మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సులు బాగున్నా.. కథలో కొత్తదనం లోపించిందనే టాక్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. తెలుగులో ఈ చిత్రం అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.