Action Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో అంటే?-bachhala malli ott release date when and where to watch allari naresh action thriller movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Ott: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో అంటే?

Action Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jan 04, 2025 02:17 PM IST

Action Thriller OTT: అల్ల‌రి న‌రేష్ బ‌చ్చ‌ల‌మ‌ల్లి సంక్రాంతి వీక్‌లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ యాక్ష‌న్ డ్రామా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ది బ‌చ్చ‌ల‌మ‌ల్లి మూవీలో హ‌నుమాన్ ఫేమ్ అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ
యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ

Action Thriller OTT: అల్ల‌రి న‌రేష్ బ‌చ్చ‌ల‌మ‌ల్లి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి సుబ్బు మంగ‌దేవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హ‌నుమాన్ ఫేమ్ అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

yearly horoscope entry point

అమెజాన్ ప్రైమ్‌...

బ‌చ్చ‌ల‌మ‌ల్లి మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. సంక్రాంతి వీక్‌లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

జ‌న‌వ‌రి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. తొంద‌ర‌లోనే బ‌చ్చ‌ల‌మ‌ల్లి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

మిక్స్‌డ్ టాక్‌...

బ‌చ్చ‌ల‌మ‌ల్లి మూవీలో హ‌రితేజ‌, రావుర‌మేష్‌, సాయికుమార్‌, రోహిణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు. డిసెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది.

అల్ల‌రి న‌రేష్ యాక్టింగ్‌, అత‌డి క్యారెక్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. కానీ కాన్సెప్ట్‌, ఎమోష‌న్స్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.

బ‌చ్చ‌ల‌మ‌ల్లి క‌థ‌...

మూర్ఖ‌త్వంతో చేసిన త‌ప్పుల కార‌ణంగా ఓ యువ‌కుడి జీవితం ఎలా నాశ‌నం అయ్యింద‌నే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు సుబ్బు మంగ‌దేవి బ‌చ్చ‌ల‌మ‌ల్లి క‌థ‌ను రాసుకున్నాడు. బ‌చ్చ‌ల‌మ‌ల్లి(అల్ల‌రి న‌రేష్‌) చ‌దువులో ముందుంటాడు. ఎలాంటి చెడు అల‌వాట్లు లేకుండా తండ్రే లోకంగా అత‌డి జీవితం సాగిపోతుంటుంది. అనుకోకుండా తండ్రి తీసుకున్న ఓ నిర్ణ‌యం కార‌ణంగా చ‌దువుకు దూర‌మ‌వుతాడు.

తాగుడుకు బానిస‌గా మారుతాడు. రోజు గొడ‌వ‌లు ప‌డుతుంటాడు. కావేరి (అమృతా అయ్య‌ర్‌)రాక‌తో బ‌చ్చ‌ల‌మ‌ల్లి జీవితం ఒక్క‌సారిగా మారిపోతుంది. మంచివాడిగా మారాల‌ని నిర్ణ‌యించుకున్న బ‌చ్చ‌మ‌ల్లి మ‌ళ్లీ మూర్ఖుడిగా ఎందుకు బ‌త‌క‌వాల్సివ‌చ్చింది? తండ్రిపై బ‌చ్చ‌ల‌మ‌ల్లి కోపం పెంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌...

ఐదున్న‌ర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. మూడు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. నాంది త‌ర్వాత స‌రైన క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు అల్ల‌రి న‌రేష్‌. నాంది త‌ర్వాత సోలో హీరోగా అల్ల‌రి న‌రేష్ న‌టించిన ఉగ్ర‌, మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం, ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. నాగార్జున‌తో క‌లిసి అల్ల‌రి న‌రేష్ న‌టించిన నా సామిరంగ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

Whats_app_banner