Baby Teaser: ముద్దు పెట్టుకుంట.. చెప్పు తెగుద్దంట.. క్యూట్‌గా ఉన్న బేబీ టీజర్
Baby Teaser: ముద్దు పెట్టుకుంట.. చెప్పు తెగుద్దంట.. అంటూ ఎంతో క్యూట్‌గా బేబీ టీజర్ మన ముందుకొచ్చేసింది. ఇది చూస్తే మీ స్కూల్లోని ఫస్ట్ క్రష్ మీకు గుర్తుకు రావడం ఖాయం.
Baby Teaser: మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అంటూ బేబీ టీజర్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్లడానికి వచ్చేసింది. క్యూట్‌గా, అదే సమయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ బేబీ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికీ తమ ఫస్ట్ క్రష్ గుర్తుకు రావడం ఖాయం అనిపించేలా ఉంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ టీజర్ సోమవారం (నవంబర్ 21) రిలీజైంది. ఈ సినిమా కోసం యంగ్ లీనేజ్ లుక్‌లో కనిపించడానికి ఆనంద్ దేవరకొండ నీట్‌గా షేవ్ చేసుకొని కనిపించాడు. అతన్ని స్కూల్లో చాటుమాటుగా చూస్తూ మురిసిపోయే డీగ్లామరస్ అమ్మాయి క్యారెక్టర్‌లో వైష్ణవి కనిపించింది. ఈ ఇద్దరి మధ్య క్యూట్ కెమెస్ట్రీ మనకు మధుర జ్ఞాపకాలను మిగుల్చుతుంది.
ఆమె ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆనంద్, వైష్ణవి మధ్య డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ముద్దు పెట్టుకుంట అని ఆనంద్ అంటే.. చెప్పు తెగుద్దంట అంటూ వైష్ణవి రిప్లై ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. ఇక మనసుకు హత్తుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ టీజర్‌కు హైలైట్ అని చెప్పొచ్చు. కలర్ ఫొటో మూవీకి కథ అందించిన సాయి రాజేష్ ఈ బేబీ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ ఎమోషనల్ డ్రామాకు డైలాగ్సే బలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను ఎస్‌కేఎన్, మారుతి కలిసి మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు.
టాపిక్