Baby Director Get Car: విడుదలకు ముందే డైరెక్టర్‌కు నిర్మాతలు కారు గిఫ్ట్.. టీజర్ చూసే ఖరీదైన బహుమానం
Baby Director Get Car: ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమా డైరెక్టర్‌కు చిత్ర విడుదలకు ముందే ప్రత్యేక బహుమతి వచ్చింది. ఈ సినిమా నిర్మాతలు అతడికి సరికొత్త ఎంజీ హెక్టార్ ప్లస్ వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు.
Baby Director Get Car: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బేబీ. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా చేస్తోంది. సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత మారుతి, సాయి శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కూడా విడుదల కాకముందే.. దర్శకుడు సాయి రాజేశ్‌కు ఖరీదైన బహుమతి అందించారు సదరు చిత్ర నిర్మాతలు. బేబీ చిత్ర టీజర్ ఫుటేజీని చూసిన నిర్మాతలు మారుతి, సాయి శ్రీనివాస్.. అతడికి కొత్తకారును బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేశ్ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
"సినిమా బాగా తీశానని ఇష్టమో.. హిట్ కొట్టాల్సిందే అని బ్లాక్ మెయిలో కానీ.. చిత్ర నిర్మాతలు కారును బహుమతిగా ఇచ్చారు. బేబీ టీజర్ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఈ సారి కూడా నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మీ పూర్తి మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా" అని సాయి రాజేశ్ తన ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
ఇంతకీ సాయి రాజేశ్‌కు నిర్మాతలు ఇచ్చిన కారు ఏంటో తెలుసా? సరికొత్త ఎంజీ హెక్టార్ ప్లస్ వాహనాన్ని అతడికి నిర్మాతలు బహుమతిగా అందించారు. బేబీ ఫుటేజీని చూసిన వారు సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా పట్ల తమ ఆనందాన్ని తెలియజేస్తూ దర్శకుడికి ఎంజీ హెక్టార్ ప్లస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. సాయి రాజేశ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
సాయి రాజేశ్ కలర్ ఫొటో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఇటీవల జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో ఈ చిత్రానికి నేషనల్ అవార్డు లభించింది. ప్రస్తుత ఆనంద్ దేవరకొండతో బేబీ సినిమాను ఈయన తెరకెక్కిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్