Shraddha Kapoor: ఆ హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పాను.. అందుకే వాళ్లతో కొట్టించింది: బేబీ జాన్ హీరో కామెంట్స్ వైరల్-baby john actor varun dhawan says he rejected shraddha kapoor proposal she beaten me up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shraddha Kapoor: ఆ హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పాను.. అందుకే వాళ్లతో కొట్టించింది: బేబీ జాన్ హీరో కామెంట్స్ వైరల్

Shraddha Kapoor: ఆ హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పాను.. అందుకే వాళ్లతో కొట్టించింది: బేబీ జాన్ హీరో కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

Shraddha Kapoor: బేబీ జాన్ మూవీలో హీరోగా నటించిన వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ తనకు ప్రపోజ్ చేసినా తాను రిజెక్ట్ చేశానని, అందుకే తనను ముగ్గురితో కలిసి కొట్టించిందని అతడు చెప్పడం విశేషం.

ఆ హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పాను.. అందుకే వాళ్లతో కొట్టించింది: బేబీ జాన్ హీరో కామెంట్స్ వైరల్

Shraddha Kapoor: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు శ్రద్ధా కపూర్. ఒకప్పటి స్టార్ నటుడు శక్తి కపూర్ కూతురిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత తన అందం, నటనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది స్త్రీ2 మూవీతో మెగా బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అలాంటి హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పే వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కానీ బేబీ జాన్ మూవీ హీరో వరుణ్ ధావన్ మాత్రం ఆ సాహసం చేశాడు. దానికి ఫలితం కూడా అనుభవించాడు.

శ్రద్ధా కపూర్ కొట్టించింది

స్త్రీ 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా శ్రద్ధా కపూర్ గతంలో ఈ విషయం చెప్పింది. తాను వరుణ్ ధావన్ కు ప్రపోజ్ చేసినా అతడు రిజెక్ట్ చేశాడని, తనకు అమ్మాయిలపై ఇంట్రెస్ట్ లేదని అన్నాడని అప్పట్లో ఆమె తెలిపింది. తాజాగా బేబీ జాన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఆమె ప్రపోజల్ ను తిరస్కరించినందుకు తనను కొట్టించిందని అతడు చెప్పడం విశేషం. అయితే ఇది జరిగింది ఎప్పుడో వాళ్ల చిన్నతనంలోనట.

యూట్యూబర్ శుభాంకర్ మిశ్రాతో మాట్లాడిన వరుణ్ ధావన్ అప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను షేర్ చేసుకున్నాడు. "అప్పుడు మేం 8 ఏళ్ల వయసు ఉన్నాం. ఆమె నాకు ప్రపోజ్ చేసినా తిరస్కరించాను. రెండేళ్ల తర్వాత శ్రద్ధా తన 10వ పుట్టిన రోజుకు ఇంటికి పిలిచింది. నేను వెళ్లే సమయానికి అక్కడ మరో ముగ్గురు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లందరికీ శ్రద్ధా అంటే చాలా ఇష్టం. నేను మాత్రం నో చెప్పడంతో ఎందుకలా చేశావంటూ నన్ను అడిగారు.

నాకు అమ్మాయిలంటే ఆసక్తి లేదు. నేను డ్యాన్స్ కాంపిటీషన్ గెలవడానికే వచ్చానని చెప్పాను. అయినా వాళ్లు వినలేదు. నాతో గొడవపడ్డారు. నన్ను కొట్టారు కూడా. ఆమె కొట్టించింది. ఎందుకంటే తనకు నేను నో చెప్పాను కదా" అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వీళ్ల క్యూట్ లవ్ స్టోరీపై అభిమానులు రియాక్టయ్యారు. చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేశారు.

ఇంకా ఒంటరిగానే శ్రద్ధా

శ్రద్ధా కపూర్ కు నో చెప్పిన వరుణ్ ధావన్.. ఇప్పటికే పెళ్లి కూడా చేసుకున్నాడు. నటాషా దలాల్ ను పెళ్లాడిన అతడికి ఈ ఏడాది జూన్ లో కూతురు పుట్టింది. మరోవైపు శ్రద్ధా మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంది. రాహుల్ మోదీతో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఇప్పటి వరకూ ఆమె స్పందించలేదు. స్త్రీ2 మూవీలో శ్రద్ధాతో వరుణ్ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ తో కలిసి అతడు బేబీ జాన్ మూవీ చేశాడు. తమిళంలో వచ్చిన తేరి మూవీకి ఇది రీమేక్. అయితే హిందీలో మాత్రం ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి.