ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన థ్రిల్లర్ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. సోషల్ మీడియాతో కలిగే రిస్క్‌లతో చిత్రం-babil khan cyber thriller movie logout getting positive response after direct streaming on zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన థ్రిల్లర్ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. సోషల్ మీడియాతో కలిగే రిస్క్‌లతో చిత్రం

ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన థ్రిల్లర్ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. సోషల్ మీడియాతో కలిగే రిస్క్‌లతో చిత్రం

లాగ్ఔట్ చిత్రం ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాబిల్ ఖాన్‍కు ప్రసంశలు దక్కుతున్నాయి. ఓటీటీ ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు చేరింది.

డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన థ్రిల్లర్ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. సోషల్ మీడియాతో కలిగే రిస్క్‌లతో చిత్రం

బాబిల్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన లాగ్ఔట్ సినిమా ముందు నుంచి ఆసక్తిని పెంచింది. ట్రైలర్ తర్వాత బజ్ బాగానే వచ్చింది. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడే బాబిల్. సోషల్ మీడియాకు బానిసలైతే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సైబర్ థ్రిల్లర్ చిత్రానికి అమిత్ గోలానీ దర్శకత్వం వహించారు. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన లాగ్ఔట్ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

సినిమాపై ప్రశంసలు

లాగ్ఔట్ సినిమా ఏప్రిల్ 18వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍‌కు అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని జీ5లో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చాలా మంది ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.

సోషల్ మీడియాకు చాలా మంది బానిసలవుతున్న ప్రస్తుతం తరుణంలో సరైన టైమింగ్‍తో లాగ్ఔట్ సినిమా వచ్చిందని, చాలా ప్రభావంతంతగా ఉందని కొందరు పోస్టులు చేశారు. బాబిల్ ఖాన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. “లాగ్ఔట్ సినిమా చూశా. సోషల్ మీడియా చీకటి కోణంపై ఆధారంగా ఈ మూవీ వచ్చింది. బాబిల్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఫాలోవర్ల కోసం ఎంత పిచ్చెక్కిపోతారో ఈ సినిమా చూపించింది. అందరూ తప్పకుండా చూడాలి” అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.

లాగ్ఔట్ సినిమా క్లైమాక్స్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొస్తున్నారు. అన్ని ఏజ్‍ల వారు ఈ చిత్రాన్ని చూడాలని, చాలా రోజుల తర్వాత ఓ సెన్సిటివ్ చిత్రం వచ్చిందని ఓ యూజర్ పోస్ట్ చేశారు. కమర్షియల్‍గా ఉంటూనే మంచి మెసేజ్ ఈ మూవీలో ఉందని, మస్ట్ వాచ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

లాగ్ఔట్ సినిమాలో బాబిల్ ఖాన్‍తో పాటు రిసిక దుగ్గల్, నిమిషా నాయర్, గంధ్వర్ దేవాన్ కీలకపాత్రలు పోషించారు. సోషల్ మీడియా చుట్టూ ఈ సైబర్ థ్రిల్లర్ చిత్రాన్ని డైరెక్టర్ అమిత్ గోలానీ తెరకెక్కించారు. ఈ సినిమాకు సమీర్ సక్సేనా, విపిన్ అగ్నిహోత్రి ప్రొడ్యూజ్ చేశారు.

లాగ్ఔట్ స్టోరీలైన్

ప్రత్‍మన్ అలియాజ్ ప్రత్యుష్ దువా (బాబిల్ ఖాన్).. సోషల్ మీడియాలో చాలా పాపులర్. తన పోటీదారు నౌతాంకితా అలియాజ్ అంకిత కంటే ముందుగా 10 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించాలని తహతహలాడుతుంటాడు. సోషల్ మీడియాలో పడి కుటుంబాన్ని కూడా ప్రత్యుష్ పట్టించుకోడు. ఈ క్రమంలో అతడి ఫోన్ పోవడంతో అంతా తలకిందులు అవుతుంది. అతడి పూర్తి డిజిటల్ అకౌంట్లను ఎస్‍కే (నిమిషా నాయర్) హ్యాక్ చేసేస్తుంది. ఆ తర్వాత తన ఫోన్ కోసం, హ్యాక్ చేసిన అకౌంట్ల కోసం ఎస్‍కేతో ప్రత్యుష్ బేరాలు మొదలుపెడతాడు. ఎస్‍కే డిమాండ్లకు ప్రత్యుత్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది లాగ్ఔట్ చిత్రంలో ఉంటుంది. థ్రిల్లింగ్‍గా ఈ సినిమా సాగుతుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం