Baazigar Sequel: షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది.. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే?-baazigar sequel shah rukh khan kajol blockbuster movie sequel on cards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baazigar Sequel: షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది.. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే?

Baazigar Sequel: షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది.. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే?

Hari Prasad S HT Telugu
Nov 13, 2024 02:10 PM IST

Baazigar Sequel: షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తుండటం విశేషం. దీనిపై ఇప్పటికే షారుక్ తో మాట్లాడుతున్నట్లు కూడా ప్రొడ్యూసర్ వెల్లడించడం విశేషం.

షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది.. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే?
షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది.. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే?

Baazigar Sequel: బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ కు తొలి సోలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బాజీగర్. 1993లో వచ్చిన ఈ సినిమాలో అతని సరసన కాజోల్, శిల్పా శెట్టి నటించారు. అప్పట్లో అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కింగ్ ఖాన్ నటించాడు. మొత్తానికి మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండటం విశేషం.

బాజీగర్ సీక్వెల్

బాజీగర్ మూవీ రిలీజయ్యే సమయానికి బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ఓ సాదాసీదా నటుడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరో. కానీ ఆ సినిమా తర్వాత అతని దశ తిరిగిపోయింది. అంతకుముందు డర్ మూవీలో నెగటివ్ పాత్ర ద్వారానే పేరు సంపాదించిన అతడు.. ఈ బాజీగర్ లోనూ అలాంటి పాత్ర ద్వారానే సక్సెస్ సాధించాడు.

అప్పట్లో కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.32 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ మూవీకి సీక్వెల్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు ప్రొడ్యూసర్ రతన్ జైన్ గుడ్ న్యూస్ చెప్పాడు. దీనిపై ఇప్పటికే షారుక్ ఖాన్ తో మాట్లాడినట్లు అతడు చెప్పడం విశేషం.

బాజీగర్ 2 కచ్చితంగా వస్తుంది

ఈటైమ్స్ తో మాట్లాడిన ప్రొడ్యూసర్ రతన్ జైన్.. బాజీగర్ మూవీకి కచ్చితంగా సీక్వెల్ వస్తుందని స్పష్టం చేశాడు. బాజీగర్ 2 కోసం తాను షారుక్ ఖాన్ తో తరచూ మాట్లాడుతూనే ఉన్నట్లు కూడా చెప్పాడు.

అయితే ఈ చర్చల్లో ఇప్పటి వరకూ పెద్దగా చెప్పుకోదగిన పురోగతి రాలేదని కూడా అన్నాడు. "బాజీగర్ 2 గురించి షారుక్ ఖాన్ తో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకూ పెద్దగా ఏమీ పురోగతి లేదు. కానీ మూవీ కచ్చితంగా చేస్తాం" అని రతన్ జైన్ స్పష్టం చేశాడు.

బాజీగర్ మూవీ స్టోరీ ఇదీ..

బాజీగర్ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న లీడ్ రోల్లో షారుక్ ఖాన్ కనిపించాడు. తన తండ్రి మరణానికి కారణమైన ఓ వ్యాపారవేత్తపై పగ పెంచుకున్న ఓ యువకుడు.. అతనిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది ఈ మూవీ స్టోరీ. ఇందులో విక్కీ మల్హోత్రా అనే యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ నటించాడు.

ఆ వ్యాపారవేత్త ఇద్దరు కూతుళ్లను ప్రేమలో దించి చిన్న కూతురు సీమ (శిల్పా శెట్టి)ను బిల్డింగ్ పైనుంచి తోసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత అదే వ్యాపారవేత్త విశ్వాసం పొంది అతని వ్యాపారాన్ని కూడా చేజిక్కించుకుంటాడు. అలా తన తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.

ఈ బాజీగర్ మూవీలో షారుక్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Whats_app_banner