Baapu OTT Streaming Date Announced Officially: తెలుగులో వచ్చిన బలగం సినిమా ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కోర్ ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలతో మలిచిన బలగం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాంటి తరహాలో ఈ మధ్య చాలా వరకు సినిమాలు వస్తున్నాయి.
రీసెంట్‌గా తెలుగులో దాదాపుగా బలగం సినిమా తరహాలోనే వచ్చిన మూవీ బాపు. ఏ ఫాదర్ స్టోరీ (ఒక తండ్రి కథ) అనేది ట్యాగ్‌లైన్. తెలుగు చిత్రాల్లో అనేక పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే బాపు. ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా చిత్రంగా బాపు రూపొందింది.
బాపు సినిమాకు దయా దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి బాపు మూవీని నిర్మించారు. బాపు సినిమాలో బ్రహ్మాజీతోపాటు సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎమోనల్ డార్క్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన బాపు సినిమాకు మంచి ప్రమోషన్స్ నిర్వహించారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాలతో ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. అయితే, బాపు సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు అయింది. సినిమాకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ, కలెక్షన్ల పరంగా పెద్దగా అర్జించలేకపోయింది.
దాంతో కమర్షియల్‌గా బాపు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే, బాపు స్టోరీ లైన్ బాగున్నప్పటికీ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయడంలో విఫలం అయిందని రివ్యూస్ తెలిపాయి. బాపులో సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రధాన పాత్రలధారుల మధ్య కెమిస్ట్రీ, బ్రహ్మాజీ ఎమోషనల్ పర్ఫామెన్స్‌కు ప్రశంసలు వచ్చాయి.
గ్రామీణ ప్రజల జీవితాలను కళ్లకు కట్టినట్లు రియలిస్టిక్‌గా చూపించినట్లుగా రివ్యూవర్లు తెలిపారు. అయితే, ఇలాంటి బాపు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 7 నుంచి జియోహాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లో బాపు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను జియోహాట్‌స్టార్ సంస్థ తాజాగా ఇవాళ (మార్చి 1) విడుదల చేసింది.
అయితే, ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన 16 రోజుల్లోనే బాపు ఓటీటీ రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను ఏ మేరకు అలరిస్తోంది చూడాలి. కాగా, బాపు సినిమాకు రానా దగ్గుబాటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వంటి స్టార్స్ ప్రమోషన్స్ చేశారు. కానీ, ఆశించిన మేర బాపు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
సంబంధిత కథనం
టాపిక్