Avika gor on Popcorn: ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అవికా గోర్. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం పాప్‌కార్న్. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయడమే కాకుండా నిర్మాతగానూ పరిచయమవుతోంది. అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా.. సినిమా గురించి, తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"ఈ సినిమా కథ వినగానే నా పరంగా ఎక్కువ టైమ్, అటెన్షన్ ఇవ్వాల్సిందేనన్న విషయం అర్థమైంది. నటిగా సెట్ వరకు వెళ్లి చెప్పింది చేసి వచ్చేస్తాం. కానీ నిర్మాతగా అయితే అన్ని విషయాలను పట్టించుకుంటాం. సినిమా ఎలా రావాలి? ఎలా ప్రమోట్ చేయాలి? స్క్రిప్ట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఇంకేమి చేయాలి? లాంటి విషయాలను ఆలోచిస్తాం. ఎప్పటి నుంచో నిర్మాత కావాలనుకున్నా. కానీ ఈ కథ వినగానే ఇదే పర్ఫెక్ట్ టైమ్ అనిపించింది. అందుకే ముందడుగు వేశాను" అంటూ అవికా స్పష్టం చేసింది.
పాప్ కార్న్ సినిమా గురించి మాట్లాడుతూ.. "కథ దాదాపు 90 శాతం లిఫ్టులో జరుగుతుందని చెప్పుకొచ్చింది అవికా. నటిగా ఇందులోని పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. 2 గంటలా 13 నిమిషాల పాటు ప్రేక్షకులు నన్ను, హీరోను చూస్తూ కూర్చోవాలి. అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆడియెన్స్‌కు మంచి కంటెంట్ ఇవ్వాలి. ఇతర నటీనటులపై ఆధారపడుకుండా ఏది చేసినిమా అంతా మేమే చేయాలి. అందుకే ఛాలెంజింగ్‌గా అనిపించి చేసేశాను." అని తెలిపింది.
పదేళ్ల కెరీర్‌లో పెద్ద సినిమాలు చేయలేదని ఎప్పుడైనా అనిపించిందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. అలా ఏం లేదని చెప్పింది. "నేను ముందు నుంచి మంచి స్క్రిప్టులు చేయాలనే అనుకున్నా. అదే చేశాను. ఎక్కడికి పోతావు చిన్నవాడ తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్‌లోనూ నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఒప్పుకోలేదు. అదే సమయంలో బాగా బరువు తగ్గాను. నా అందం, ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. ఈ విరామం నా వృద్ధికి చాలా దోహదపడింది." అని అవికా గోర్ స్పష్టం చేసింది.
హీరో సాయి రోనక్ గురించి మాట్లాడుతూ.. అతడు చాలా అమేజింగ్ పర్సన్ అని ప్రశంసించింది. గతంలో తాను అతడితో హ్యాష్ ట్యాగ్ బ్రో అనే సినిమా చేశానని, అతడి మీద ముందు నుంచి తనకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు కూడా అతడిని తనే సజెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది.
సంబంధిత కథనం
టాపిక్