OTT Horror Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన అవికా గోర్ హారర్ థ్రిల్లర్ సినిమా.. వివరాలివే
Bloody Ishq OTT Horror Thriller: బ్లడీ ఇష్క్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ట్రైలర్‌తో ఆసక్తి రేపిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ వివరాలు ఇవే.
హీరోయిన్ అవికా గోర్ వరుసగా ఓటీటీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఓ వైపు చిత్రాలు చేస్తూనే.. ఎక్కువగా ఓటీటీ కంటెంట్‍పై దృష్టి పెట్టారు. అవికా గోర్ ప్రధాన పాత్రలో తాజాగా బ్లడీ ఇష్క్ చిత్రం రూపొందింది. ఈ మూవీకి హారర్ చిత్రాల స్పెషలిస్ట్, సీనియర్ డైరెక్టర్ విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ షురూ అయింది.
స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఇదే
బ్లడీ ఇష్క్ చిత్రం నేడు (జూలై 26) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలోకి రాకుండా నేరుగా ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. ట్రైలర్‌తోనే ఆసక్తి రేపడం సహా రాజ్, 1920 లాంటి హారర్ చిత్రాలకు తెరకెక్కించిన విక్రమ్ భట్ దర్శకత్వం వహించడంతో బ్లడీ ఇష్క్ మూవీకి బజ్ వచ్చింది.
బ్లడీ ఇష్క్ సినిమా నేడు హాట్‍స్టార్ ఓటీటీలో హిందీలో ఒక్కటే స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ వస్తుందేమో చూడాలి. ఇప్పటికైతే హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
బ్లడీ ఇష్క్ మూవీలో అవికా గోర్, వర్దన్ పూరి, శ్యామ్ కోశోర్, జెన్నిఫర్ పిసినాటో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మహేశ్ భట్, సుహ్రితా దాస్ కథ అందించారు. తన మార్క్ టేకింగ్‍లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ భట్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి షామీర్ టాండన్, ప్రతీక్ వాలియా సంగీతం అందించారు.
హరే కృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్టర్స్ పతాకాలపై బ్లడీ ఇష్క్ చిత్రం రూపొందింది. రాకేశ్ జునేజా నిర్మాతగా వ్యవహరించారు. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. షూటింగ్ మొదలుపెట్టాక కూడా ఇదే ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. నేరుగా హాట్‍స్టార్ ఓటీటీలోకే తీసుకొచ్చేశారు.
బ్లడీ ఇష్క్ స్టోరీలైన్
ఓ ఘటన వల్ల గతం మరిచిపోయిన నేహా (అవికా గోర్)ను స్కాట్‍ల్యాండ్‍లో ఓ ఐల్యాండ్‍పై ఉన్న పెద్ద భవనానికి భర్త రోమేశ్ (వర్దన్ పూరి) తీసుకెళతాడు. నీటిలో పడడం వల్ల గతం మరిచిపోయావని నేహాకు రోమేశ్ చెబుతాడు. ఆ తర్వాత ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు నేహా భయపడుతుంది. అదే నిజం అవుతుంది. ఈ ఇంట్లో ఉన్న దెయ్యం నేహాను చంపాలని ప్రయత్నిస్తుంటుంది. అసలు దెయ్యంగా మారింది ఎవరు? నేహాను చంపాలని ప్రయత్నించేది ఎవరు? గతం ఏంటి? అనేది బ్లడీ ఇష్క్ సినిమా మెయిన్ పాయింట్లుగా ఉన్నాయి.
చట్నీ సాంబర్ సిరీస్
డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు (జూలై 26) చట్నీ సాంబార్ అనే తమిళ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్‍లో తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్ర పోషించారు. కామెడీ డ్రామా సిరీస్‍గా తెరకెక్కించారు డైరెక్టర్ రాధా మోహన్. ఈ సిరీస్‍లో యోగిబాబుతో పాటు మైనా నందిని, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, ఎలాంగో కుమారవేల్ కీలకపాత్రలు పోషించారు. ఈ తమిళ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‍లోనూ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.