Avika Gor: ఇప్పటికీ 20 పెళ్లిళ్లు చేసుకున్నా.. పదేళ్లకు అలా: హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్-avika gor about 20 times marriage onscreen in vadhuvu web series promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avika Gor: ఇప్పటికీ 20 పెళ్లిళ్లు చేసుకున్నా.. పదేళ్లకు అలా: హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్

Avika Gor: ఇప్పటికీ 20 పెళ్లిళ్లు చేసుకున్నా.. పదేళ్లకు అలా: హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 06, 2023 12:59 PM IST

Avika Gor About 20 Times Marriages: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలనటి అవికా గోర్ ప్రస్తుతం హీరోయిన్‌గా చాలా బిజీగా ఉంది. తాజాగా ఆమె ఇప్పటికీ కనీసం 20 సార్లు పెళ్లి చేసుకున్నట్లుగా అవికా గోర్ తెలిపింది. దీంతో అవికా లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికీ 20 పెళ్లిళ్లు చేసుకున్నా.. పదేళ్లకు అలా: హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్
ఇప్పటికీ 20 పెళ్లిళ్లు చేసుకున్నా.. పదేళ్లకు అలా: హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్

Avika Gor Vadhuvu OTT Series: 2008లో బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) అనే హిందీ టీవీ షోతో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న బాలనటి అవికా గోర్. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ 2013లో ఉయ్యాలా జంపాల మూవీతో తెలుగులో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అవికాకు అంతగా క్లిక్ కాలేదు.

కానీ, టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది అవికా గోర్. ఇటీవలే మాన్షన్ 24, 1920 వంటి హారర్ సినిమాలతో అలరించింది. ఇప్పుడు వధువు అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి రానుంది అవికా గోర్. ఇందులో ఆమెతోపాటు నందు, అలీ రెజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్వీఎఫ్ బ్యానర్‌లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.

వధువు వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వధువు సిరీస్ ప్రమోషన్లలో పెళ్లి గురించి అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చేసేటప్పుడు నాకు పదేళ్లు. అప్పటికీ పెళ్లంటే ఏంటో తెలీదు. పెళ్లి కూతురు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవహరించాలి వంటి విషయాలపై నాకు ఏమాత్రం అవగాహన లేదు" అని అవికా గోర్ చెప్పింది.

"నాకు ఏమైనా సందేహం వస్తే డైరెక్టర్‌ను అడిగేదాన్ని. ఆ సమయంలో ఎలా చేయాలో పూర్తిగా దర్శకుడిపై ఆధారపడేదాన్ని. ఇప్పుడు వధువు వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది పడలేదు. చిన్నారి పెళ్లి కూతురు నుంచి ఇప్పటివరకు నేను ఆన్ స్క్రీన్‌పై 20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటాను. అది నాకు ఎప్పుడూ బోర్ కొట్టదు. అప్పటికీ ఇప్పటికీ నా దృష్టికోణం మారిపోయింది. అందుకే వధువు కోసం పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు సహజంగా నటించాను" అని అవికా గోర్ చెప్పుకొచ్చింది.

"ప్రస్తుతం తెలుగు ఆది సాయి కుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. అలాగే హిందీలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిర్మాతగా పాప్ కార్న్ మూవీ తీయడం గర్వంగా ఉంది. ఈ మధ్య నా దగ్గరికి ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్స్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. మంచి ప్రేమకథలు, నటిగా భిన్నకథలతో తెరకెక్కే సినిమాలు చేయాలని ఉంది" అని అవికా గోర్ తెలిపింది.

Whats_app_banner