Avatar 2 Twitter Review: అవతార్ 2 ఓ విజువల్ వండర్.. ట్విటర్ రివ్యూ వచ్చేసింది
Avatar 2 Twitter Review: అవతార్ 2 ఓ విజువల్ వండర్ అంటూ ట్విటర్‌లో ఫ్యాన్స్ తేల్చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (డిసెంబర్ 16) రిలీజైన విషయం తెలిసిందే.
Avatar 2 Twitter Review: అవతార్ ది వే ఆఫ్ వాటర్ లేదా అవతార్ 2.. మొదటి సినిమా అవతార్ రిలీజైన 13 ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్, ఇప్పటి వరకూ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన అవతార్‌కు సీక్వెల్‌గా రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ట్రెండింగ్ వార్తలు
రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయడంతో అప్పుడే రివ్యూలు వచ్చేశాయి. పలు హాలీవుడ్ వెబ్‌సైట్లు ఈ సినిమాపై పెదవి విరిచాయి. విజువల్ పరంగా బాగానే ఉన్నా.. స్టోరీ పెద్దగా కనెక్ట్ కాదని అవి తేల్చేశాయి. అయితే ఇండియన్ వెబ్‌సైట్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్‌ను ఆకాశానికెత్తారు. జేమ్స్ కామెరాన్ ముందు మోకరిల్లాలని అనిపిస్తోందంటూ ఈ సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ అన్నాడు.
ఇక ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు కూడా శుక్రవారం తెల్లవారుఝాము నుంచే అవతార్ 2 చూసి ట్విటర్‌లో రివ్యూలు రాస్తున్నారు. "అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఓ విజువల్ ట్రీట్. ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతుంది. క్లైమ్యాక్స్ ఇంకాస్త మంచిగా ఉండాల్సింది. మంచి 3డీ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్‌లో ఈ సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరు" అని ఓ యూజర్ రాశారు.
"అవతార్ ది వే ఆఫ్ వాటర్‌ను ఐమ్యాక్స్‌లో చూశాను. ఐమ్యాక్స్‌లో చూడటం చాలా గొప్ప అనుభూతిని కలిగించింది. అందరూ ఐమ్యాక్స్‌లోనే ఈ సినిమా చూడండి. గ్రాఫిక్స్, ఫొటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అన్నీ అద్భుతం. స్క్రీన్‌ప్లే కూడా. అద్భుతమైన సీక్వెల్" అని మరో యూజర్ తన రివ్యూ చెప్పారు.
"అవతార్ ది వే ఆఫ్ వాటర్ విజువల్ పరంగా అద్భుతంగా ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఈ సినిమా ఎమోషనల్‌గా కూడా బాగుంది. అవతార్ కంటే కూడా ఈ సీక్వెల్ బాగుంది. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి" అని మరో యూజర్ రాశారు.
"జేమ్స్ కామెరాన్ మన టైమ్ కంటే ఎంతో ముందున్నాడు. నీటి లోపలి విజువల్స్ అత్యద్భుతం. నెయ్‌తిరిగా సల్డానా స్క్రీన్‌పై అగ్గి పుట్టించింది. ఫ్యామిలీయే ఈ సినిమాకు బలం. అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఓ మంచి సినిమాటిక్ అనుభవం" అని ఇంకో యూజర్ తన రివ్యూ చెప్పారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్‌పై ఓ మంచి 3డీ మూవీ చూసిన అనుభూతి చెందానంటూ మరో యూజర్ ఒక్క ముక్కలో అవతార్ 2 గురించి వివరించారు.