Avatar Day 2 Collection: అవతార్ 2 కలెక్షన్స్ - ఇండియాలో రెండు రోజుల్లో వంద కోట్లు క్రాస్
Avatar Day 2 Collections: జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుంటోంది. రెండు రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా వంద కోట్ల మైలురాయిని దాటింది.
Avatar Day 2 Collections: అవతార్ -2 సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ రెండు రోజుల్లోనే ఇండియాలో 102 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. తొలి రోజు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 52 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా కాసుల వర్షాన్ని కురిపించింది.
ట్రెండింగ్ వార్తలు
దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల్లో నార్త్ ఇండియాలో ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. తెలుగు రాష్ట్రాల్లొ ఇరవై ఐదు కోట్లు, తమిళనాడులో 10 కోట్లు, కర్నాటకలో 14.50 కోట్లు, కేరళలో ఆరు కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా 102 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగులో తొలిరోజు 13 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా సత్తా చాటింది. దాదాపు 12 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు తెలిసింది. వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో ఈ సినిమా 1500 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. 2009లో రూపొందిన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా జేమ్స్ కామెరూన్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాను తెరకెక్కించారు.
గ్రాఫిక్స్, యాక్షన్ అంశాల కంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఈ సినిమాలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్వారిచ్ బృందం నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి జాక్ నెట్రి సాగించే పోరును ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్.