Avatar 2 Advance Bookings: అవతార్‌ 2 అడ్వాన్స్‌ బుకింగ్స్ షురూ.. ఆ రోజు అర్ధరాత్రి నుంచే షోలు-avatar 2 advance bookings started in india and midnight shows in selected theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Avatar 2 Advance Bookings Started In India And Midnight Shows In Selected Theaters

Avatar 2 Advance Bookings: అవతార్‌ 2 అడ్వాన్స్‌ బుకింగ్స్ షురూ.. ఆ రోజు అర్ధరాత్రి నుంచే షోలు

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 09:13 PM IST

Avatar 2 Advance Bookings: అవతార్‌ 2 అడ్వాన్స్‌ బుకింగ్స్ మొదలయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఓ హాలీవుడ్‌ మూవీ స్పెషల్‌ షోలు అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుండటం విశేషం.

డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న అవతార్: ది వే ఆప్ వాటర్
డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న అవతార్: ది వే ఆప్ వాటర్

Avatar 2 Advance Bookings: హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన అద్భుతం అవతార్‌. 2009లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అలాంటి సినిమా సీక్వెల్‌ 13 ఏళ్ల తర్వాత వస్తోందంటే ఎంతటి హంగామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అలాంటి వాతావరణమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది.

ఈ సినిమా డిసెంబర్‌ 16న రిలీజ్‌ కాబోతోంది. అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌ మూవీ చివరి ట్రైలర్‌ కూడా మంగళవారం (నవంబర్‌ 22) రిలీజైంది. ఈ విజువల్‌ వండర్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూడటానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటు ఇండియాలోనూ ఈ మూవీపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ఇప్పటి నుంచే అవతార్‌ 2 అడ్వాన్స్‌ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

అంతేకాదు డిసెంబర్‌ 16 అర్ధరాత్రి 12 గంటల నుంచే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్పెషల్‌ షోలు ఏర్పాటు చేశారు. ఈ సినిమా ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తోంది. స్పెషల్ షోలు దేశంలోని ఎంపిక చేసిన థియేటర్లలో ఉంటాయి. అవతార్‌ మూవీలో నేలపై ఉన్న పండోరా ప్రపంచాన్ని చూపించిన కామెరాన్‌.. ఈసారి నీళ్ల లోపలి పండోరా ప్రపంచాన్ని చూపించనుంది.

ఇప్పటికే వచ్చిన మూడు ట్రైలర్లు అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌పై అంచనాలను భారీగా పెంచేశాయి. లేటెస్ట్‌ ట్రైలర్‌లో జేక్‌ సల్లీ, నెయ్‌తిరి తమ పిల్లలకు నీటిలో డ్రాగన్స్‌పై ఎలా రైడ్‌ చేయాలో చెబుతుంటారు. ఇక్కడ మనుగడ సాగించాలంటే ఇది నేర్చుకోవాల్సిందేనని చెప్పడం ట్రైలర్‌లో చూడొచ్చు. ఇక ఆ తర్వాత తమపైకి మరోసారి దండెత్తి వచ్చిన మనిషిని ఎలా ఎదుర్కొన్నారో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఐమ్యాక్స్‌ త్రీడీ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ కాబోతోంది.

IPL_Entry_Point

టాపిక్