Attack On Khailash Kher : కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. ఇద్దరి అరెస్ట్
Attack On Singer Kailash Kher : కర్ణాటక హంపిలో జరిగిన ఓ ఈవెంట్లో సింగర్ కైలాష్ ఖేర్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇటీవలే సింగర్ మంగ్లీ(Singer Mangli)పై బళ్లారిలో దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనను మంగ్లీ ఖండించింది. తాజాగా మరో సింగర్ పై కర్ణాటకలో దాడి జరిగింది. ఫేమస్ సింగర్ కైలాష్ ఖేర్(Kailash Kher) మీద దాడి జరగగా.. అతడు తప్పించుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ పాటలు పాడటం కంటిన్యూ చేశాడు. జనవరి 27న ప్రారంభమైన మూడు రోజుల హంపి ఉత్సవ్ లో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్, శాండల్‌వుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
కర్ణాటక ప్రభుత్వం హంపీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రముఖ కళాకారులతో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తోంది. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ కూడా ఇందులో పాల్గొన్నాడు. మ్యూజికల్ నైట్ లో అతడిపై వాటర్ బాటిల్స్ విసిరారు. అయితే స్టేజీ మీద కైలాష్ హిందీ పాటలు పాడాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు కన్నడ పాటలు పాడాలని గొడవ చేశారు. అప్పుడే చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్ విసిరేశారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
కొంతమంది ప్రేక్షుకులు కోరిన పాటలను కూడా కైలాష్ పాడలేదని ఫీల్ అయినట్టుగా అంటున్నారు. అక్కడే ఉన్న పోలీసులు.. ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఆ తర్వాత కైలాష్ ఖేర్ పాటలు పాడటం కంటిన్యూ చేశాడని చెబుతున్నారు. వాటర్ బాటిళ్లు ఖేర్ పక్కనే పడినా.. పట్టించుకోకుండా పాటను కొనసాగించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరినీ అరెస్టు చేశారు. కానీ కైలాష్ టీమ్ నుంచి మాత్రం.. ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవలే సింగర్ మంగ్లీ మీద బళ్ళారిలో దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. మంగ్లీ కన్నడలో మాట్లాడమంటే.. మాట్లాడలేదని.. అందుకే దాడి చేశారని వైరల్ చేశారు. కానీ ఈ విషయాన్ని ఆమె మాత్రం ఖండించింది.