ATM Trailer: టాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకడు హరీష్ శంకర్. షాక్, గబ్బర్‌సింగ్, మిరపకాయ్, దువ్వాడ జగన్నాథంలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తొలిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. జీ5లో రానున్న ఏటీఎం (ATM) వెబ్ సిరీస్ కు హరీష్ శంకరే స్టోరీ అందించాడు. ఈ సిరీస్ జీ5లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.,ఈ సిరీస్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఏటీఎంల దోపిడీ చుట్టూల తిరిగే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. అందరూ కష్టపడి డబ్బు దాచుకుంటే.. మేము వాటిని దోచుకుంటాం అనే డైలాగ్ ఈ ట్రైలర్‌లో ఉంది. దీనిని బట్టి ఇందులోలో ప్రధాన కథాంశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ లో జగన్ అనే పాత్రలో కనిపించాడు వీజే సన్నీ.,అతనితో పాటు మరో ముగ్గురు ఈ దోపిడీలకు పాల్పడే గ్యాంగ్‌గా కనిపించారు. చిన్న చిన్న దొంగతనాలతో మొదలుపెట్టి పెద్ద దోపిడీలకు పాల్పడే స్థాయికి చేరడం, ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లు, వాళ్లను పట్టుకోవడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ (సుబ్బరాజు) రాకతో ఈ ట్రైలర్ ఉత్కంఠను రేపుతోంది. ఇందులో డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి,సీ చంద్ర మోహన్ ఈ వెబ్ సిరీస్ కు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అందించాడు. ఇక దీనికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ట్రైలర్ ఉత్కంఠగా అనిపించడంలో మ్యూజిక్ కూడా తన వంతు సాయం చేసింది. మరి ఈ ఏటీఎం సిరీస్ ఎలా ఉండబోతోంది? ఓటీటీలోనూ హరీష్ శంకర్ సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి.,