Atal Bihari Vajpayee Biopic: అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ - టైటిల్ రోల్ ఎవరు చేశారంటే
Atal Bihari Vajpayee Biopic: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు...
Atal Bihari Vajpayee Biopic: దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం వెండితెరపైకి రాబోతున్నది. ఈ బయోపిక్‌కు మై అటల్ హూ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పాత్రలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి కనిపించబోతున్నాడు. అటల్ బిహారీ జయంతి సందర్భంగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ పోస్టర్‌లో పంకజ్ త్రిపాఠి పూర్తిగా అటల్ బిహారీని పోలి కనిపిస్తున్నాడు. హావభావాలు, రూపురేఖలు మొత్తం మాజీ ప్రధానిని పోలి ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఈ పోస్టర్‌లో కుర్తా, దోతీ ధరించి పంకజ్ త్రిపాఠి కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ అవార్డ్ గ్రహీత రవి జాదవ్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు
అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితంలోని కీలక ఘట్టాలను ఈ బయోపిక్‌లో చూపించబోతున్నట్లు తెలిసింది. ప్రధానిగా ఆయనకు ఎదురైన సవాళ్లు, రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సంఘర్షణను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
గొప్ప నాయకుడిగా పాత్రను వెండితెరపై పోషించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు పంకజ్ త్రిపాఠి పేర్కొన్నాడు. సందీప్‌సింగ్, వినోద్, సామ్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో మై అటల్ హూ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
టాపిక్