OTT Malayalam Thrillers: ఆసిఫ్ అలీ.. మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఓ విలక్షణ నటుడు. తాజాగా ఈ ఏడాది రేఖాచిత్రమ్ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
అనస్వర రాజన్ కూడా నటించిన ఈ సినిమాను జోఫిన్ టీ చాకో డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మీకు బాగా నచ్చిందా? అయితే ఆసిఫ్ అలీ నటించిన మరిన్ని మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూసేయండి.
ఆసిఫ్ అలీ నటించిన థ్రిల్లర్ మలయాళం మూవీస్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సోనీ లివ్, జియోహాట్‌స్టార్, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో బెస్ట్ ఏవో చూడండి.
ఆసిఫ్ అలీ నటన, ఆకర్షణీయమైన కథనం ఈ మిస్టరీ థ్రిల్లర్ అయిన కిష్కింధ కాండంను మస్ట్ వాచ్ మూవీగా మార్చేశాయి. ఇది 2024లో బాక్సాఫీస్ దగ్గర కూడా విజేతగా నిలిచింది. అపర్ణ బాలమురళి కూడా నటించింది. ఆమె తన మామ (విజయరాఘవన్) ఇంట్లో జరుగుతున్న రహస్య సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా ఓ మిస్ అయిన గన్ చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. మూవీలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్ లో నటించారు. ఆసిఫ్ అలీ ఒక లెవెల్ క్రాస్‌లో రైల్వే గేట్‌కీపర్ రఘు పాత్రను పోషించాడు. అతను ఈ లెవెల్ క్రాస్‌లో చైతాలి(అమలా పాల్) అనే అమ్మాయిని కలుస్తాడు. ఓ రైల్లో నుంచి పడిపోయిన ఆ అమ్మాయి.. ఆ రైల్వే గేట్ కీపర్ జీవితాన్ని ఎలా మార్చేస్తుందన్నది ఈ మూవీలో చూడొచ్చు. క్లైమ్యాక్స్ ట్విస్ట్ అస్సలు మిస్ కావద్దు.
ఆసిఫ్ అలీ ఈ థ్రిల్లర్ మూవీలో బిజు మీనన్‌తో చేతులు కలిపాడు. ఇది ఇద్దరు పోలీసులు చుట్టూ తిరిగే కథ. సీనియర్, జూనియర్ పోలీస్ అధికారుల మధ్య ఉండే ఈగోలను చూపించడంతోపాటు ఓ సీనియర్ ఆఫీసర్ ఇంట్లో దొరికిన శవం కేసును ఓ జూనియర్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయడం, ఈ క్రమంలో వాళ్ల మధ్య తరిగే దూరం, ఈ కేసును పరిష్కరించే తీరు.. మంచి థ్రిల్ ను పంచుతుంది.
ఆంటోనీ వర్గీస్, నిమిషా సజయన్, ఆసిఫ్ అలీ.. ఈ అద్భుతమైన త్రయం ఈ మలయాళ థ్రిల్లర్‌ను పవర్ ఫుల్ గా మార్చేసింది. ఇది ఇద్దరు వ్యక్తులు తనను వాడుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఇబ్బందుల్లో పడే ఓ నటుడి కథను చెబుతుంది. జిస్ జోయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా మంచి థ్రిల్లరే.
ఆసిఫ్ అలీ 2010లో వినయ్ ఫోర్ట్, నిత్యా మీనన్, నిషాన్ వంటి యువ నటీనటులతో కలిసి ఈ థ్రిల్లర్ మూవీలో నటించాడు. సిబి మలయిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కాలేజీ స్టూడెంట్ రూపేష్ కథను చెబుతుంది. అతను నాన్సీని ప్రేమిస్తాడు. కానీ నాన్సీ ధనవంతుడైన తండ్రి ఆమెను మరచిపోవడానికి డబ్బును ఆఫర్ చేసినప్పుడు, అతను అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ థ్రిల్లర్ మూవీ కూమన్ కోసం ఆసిఫ్ అలీతో చేతులు కలిపాడు. ఆసిఫ్ అలీ యువ సీపీవో గిరీశంకర్ పాత్రలో నటించాడు. అతను ఆధారాలు సేకరించడంలో నిపుణుడు. కానీ అతనికో బలహీనత ఉంటుంది. ఆకర్షణీయమైన కథనం, నటీనటుల నటన ఈ మూవీని ప్రేక్షకులకు దగ్గర చేసింది.
సంబంధిత కథనం