Shivam Bhaje Teaser: ఇంట్రెస్టింగ్‍గా అశ్విన్ బాబు కొత్త సినిమా టీజర్.. “నీలకంఠుడే లిఖించిన శత్రువినాశనం”-ashwin babu starrer shivam bhaje first cut teaser impressive with action and devotion ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shivam Bhaje Teaser: ఇంట్రెస్టింగ్‍గా అశ్విన్ బాబు కొత్త సినిమా టీజర్.. “నీలకంఠుడే లిఖించిన శత్రువినాశనం”

Shivam Bhaje Teaser: ఇంట్రెస్టింగ్‍గా అశ్విన్ బాబు కొత్త సినిమా టీజర్.. “నీలకంఠుడే లిఖించిన శత్రువినాశనం”

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 19, 2024 08:30 PM IST

Shivam Bhaje First Cut Teaser: శివం భజే సినిమా ఫస్ట్ కట్ టీజర్ వచ్చేసింది. యాక్షన్‍, డెవోషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా ఉంది. అశ్విన్ బాబు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

Shivam Bhaje: ఇంట్రెస్టింగ్‍గా అశ్విన్ బాబు కొత్త సినిమా టీజర్.. “నీలకంఠుడే లిఖించిన శత్రువినాశనం”
Shivam Bhaje: ఇంట్రెస్టింగ్‍గా అశ్విన్ బాబు కొత్త సినిమా టీజర్.. “నీలకంఠుడే లిఖించిన శత్రువినాశనం”

Shivam Bhaje First Cut Teaser: యంగ్ హీరో అశ్విన్ బాబు వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. గతేడాది సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’తో మెప్పించారు. ప్రస్తుతం ‘శివం భజే’ సినిమాలో అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఆధ్యాత్మికం కలబోతతో రూపొందింది. ఈ మూవీకి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘శివం భజే’ సినిమా ఫస్ట్ కట్ టీజర్ నేడు (జూన్ 19) రిలీజ్ అయింది.

టీజర్ ఇలా..

శివం భజే సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. అశ్విన్ బాబుకు కల రావడం.. అందులో శివుడి ఫొటోపై రక్తం చిందే షాట్లతో శివం భజే టీజర్ మొదలైంది. “సడెన్‍గా హెడేక్ వస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు” అని తన ప్రాబ్లమ్‍ను డాక్టర్‌కు చెబుతాడు అశ్విన్. “అలజడి దాటి ఆలోచనలకు పదును పెడితే అంతా అర్థమవుతుంది శేఖరా. ఈ యుద్ధం నీది కాదు. స్వయానా ఆ నీలకంఠుడే లిఖించిన శత్రు వినాశనం” అంటూ ఓ అఘోరా డైలాగ్ ఉంది. అంటే శివుడి ఆజ్ఞతో తన ప్రమేయం లేకుండానే దుష్టులను అశ్విన్ చంపుతాడనే కాన్సెప్ట్ ఉండనుందని అర్థమవుతోంది.

ఆ తర్వాత కొన్ని క్రైమ్స్ జరిగినట్టు టీజర్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. “నీకు తెలియకుండానే ఊహించని ప్రళయాన్ని ఢీకొట్టబోతున్నావు” అని ఆ అఘోర అంటారు. ఆ తర్వాత యాక్షన్ సీన్లు ఉన్నాయి. నాలుక బయటపెట్టి.. విలన్‍ను పీకపట్టుకొని ఒక్కచేత్తో అశ్విన్ ఎత్తే షాట్‍ సూపర్‌గా ఉంది. చివర్లో పరమ శివుడే కదిలి వస్తున్నట్టుగా ఉన్న షాట్‍తో శివం భజే టీజర్ ముగిసింది.

ఒక నిమిషం 14 సెకన్ల పాటు ఉన్న శివం భజే టీజర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్, క్రైమ్, డెవోషన్‍తో ఇంటెన్స్‌గా సాగింది. అశ్విన్ యాక్టింగ్, దర్శకుడు అప్సర్ టేకింగ్ ఇంప్రెసివ్‍గా కనిపిస్తోంది. వికాస్ బాడిస ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ టీజర్‌తో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

శివం భజే చిత్రంలో అశ్విన్ బాబుకు జోడీగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్, మురశీ శర్మ, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి, దేవీ ప్రసాద్, అయ్యప్ప శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

అశ్విన్ బాబు కెరీర్

ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అశ్విన్ బాబు. 2012లో జీనియర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత జతకలిసే చిత్రం చేశారు. రాజుగారిగది మూవీతో అశ్విన్‍కు హిట్ దక్కింది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2015లో రాగా.. విజయం సాధించింది. ఆ తర్వాతి ఏడాది అశ్విన్ చేసిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాజుగారిగది 2, రాజుగారిగది 3 సినిమాలు పర్వాలేదనిపించాయి. సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత గతేడాది హిడింబ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అశ్విన్ బాబు. ఈ మూవీ మోస్తరుగా ఆడింది. ప్రస్తుతం శివం భజే చిత్రం చేస్తున్నారు.

WhatsApp channel