Action OTT: తెలుగు కంటే ముందు హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్‍కు టాలీవుడ్ చిత్రం.. ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చిన మూవీ
Action Drama OTT: దేవకీ నందన వాసుదేవ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ మూవీ తెలుగు కంటే ముందు హిందీలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రిలీజ్‍కు ముందు మంచి బజ్ వచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది నవంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజైంది. హనుమాన్ సినిమాతో బ్లాక్‍బస్టర్ సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి స్టోరీ అందించడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైథలాజికల్ టచ్‍తో ఈ యాక్షన్ డ్రామా మూవీ రూపొందడంతో ఆసక్తి పెరిగింది. అయితే ఈ దేవకీ నందన వాసుదేవ చిత్రం థియేటర్లలో నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

తెలుగు కంటే ముందు హిందీలో..
దేవకీ నందన వాసుదేవ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. కానీ తెలుగులో కాకుండా ముందుగా హిందీ డబ్బింగ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీలో టీవీ ఛానెల్‍లోనూ ప్రసారం కానుంది.
స్ట్రీమింగ్ వివరాలివే..
దేవకీ నందన వాసుదేవ హిందీ డబ్బింగ్ వెర్షన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్‍కు రానుంది. అదే సమయానికి కలర్స్ సినీప్లెక్స్ హిందీ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది.
దేవకీ నందన వాసుదేవ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకున్నట్టు రూమర్లు వచ్చాయి. తెలుగులో అదే ఓటీటీలో గత డిసెంబర్ ఆఖర్లో స్ట్రీమింగ్‍కు రానుందంటూ అంచనాలు వెలువడయ్యాయి. అయితే, ఆలస్యమైంది. ఇంతలోనే తెలుగు కంటే ముందు హాట్‍స్టార్ ఓటీటీలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది.
ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చిన దేవకీ నందన వాసుదేవ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. పురాణాల టచ్ ఇచ్చి ఈ యాక్షన్ స్టోరీని ప్రశాంత్ రాసుకున్నారు. అయితే, ఈ మూవీ ప్రేక్షకులకు పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో అశోక్ గల్లా, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. దేవ్‍దత్ నాగే, శత్రు, ఝాన్సీ, నాగమహేశ్ కీలకపాత్రలు పోషించారు.
దేవకీ నందన వాసుదేవ మూవీని లలితాంబిక ప్రొడక్షన్ పతాకంపై సోమినేని బాలకృష్ణ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. బడ్జెట్‍లో 30 శాతం కూడా రికవరీ కాలేదని అంచనా. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఈరోల్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరించారు.
కాగా, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ వారమే ‘కోబలి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సిరీస్ తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన ఈ సిరీస్‍లో రవి ప్రకాశ్ ప్రధాన పాత్ర పోషించారు.
సంబంధిత కథనం