Ashish Vidayarthi Divorce: ఆనందం కోసం రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భార్యతో విడాకులపై ఆశిష్ విద్యార్థి స్పందన-ashish vidyarthi opens up about divorce from piloo after marrying rupali barua
Telugu News  /  Entertainment  /  Ashish Vidyarthi Opens Up About Divorce From Piloo After Marrying Rupali Barua
మొదటి భార్యతో విడాకులపై స్పందించిన ఆశిష్ విద్యార్థి
మొదటి భార్యతో విడాకులపై స్పందించిన ఆశిష్ విద్యార్థి

Ashish Vidayarthi Divorce: ఆనందం కోసం రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భార్యతో విడాకులపై ఆశిష్ విద్యార్థి స్పందన

26 May 2023, 19:28 ISTMaragani Govardhan
26 May 2023, 19:28 IST

Ashish Vidayarthi Divorce: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆశిష్ విద్యార్థి తన మొదటి భార్యతో విడాకులకు గల కారణాన్ని వివరించాడు. జీవితంలో సంతోషం కోసం ఏదైనా చేస్తామని, తాను కూడా ఆనందం కోసం రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

Ashish Vidayarthi Divorce: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఆర్టిసులు వయసుతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతుండగా.. ఇటీవలే పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మెప్పించిన ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకుని ఆశ్చర్యపరిచారు. 60 ఏళ్ల వయసులో ఆయన 33 ఏళ్ల రుపాలి బరువాను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ వివాహంపై ఆయన స్పందించారు. తన మొదటి భార్య పిలో విద్యార్థితో విడాకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా విడాకుల తర్వాత ఆమెతో మాట్లాడానని కూడా తెలిపారు.

"అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. 22 ఏళ్ల క్రితం పీలోను నేను వివాహం చేసుకున్నాను. మా బంధం అద్భుతంగా సాగింది. మాకు అర్ధ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే గత రెండేళ్లుగా మా మధ్య జరిగిన సంఘటనలను గుర్చించి చర్చించుకున్నాం. భవిష్యత్తులో ఇద్దరం ఒకరికొకరం విభిన్నంగా ఉంటామని అర్థమైంది. మా మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించుకోవాలని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. మా మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆనందాన్ని దూరం చేస్తుంది. మనకు కావాల్సిందే సంతోషమే కదా? కాబట్టి మేము కూర్చొని మాట్లాడుకుని ఫరస్పర అంగీకారంతో విడిపోయాం. అలాగే స్నేహాపూర్వకంగా ఉండాలని అనుకున్నాం" అని అన్నారు.

తన మొదటి భార్యతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా విడిపోయామని ఆశిష్ విద్యార్థి అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరితోనైనా ప్రయాణం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వివాహం చేసుకున్నానని ఆయన అన్నారు. ఈ బంధంపై తనకు పూర్తి నమ్మకముందని తెలిపారు.

ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకోవడం విశేషం. గురువారం (మే 25) అసోం చెందిన రూపాలీ బారువాతో ఏడడుగులు నడిచాడు. ఆశిష్ కు ఇది రెండో పెళ్లి. కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీళ్లు పెళ్లి చేసుకున్నారు.

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఒడియా, బెంగాలీ భాషల్లో నటించాడు. ఇప్పటి వరకూ 11 భాషల్లో 300కుపైగా సినిమాల్లో నటించడం విశేషం. 1995లో ద్రోహ్‌కాల్ సినిమాకుగాను అతడు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు.