Avatara Purusha 2 OTT: ఓటీటీలోకి వచ్చిన నా సామిరంగ హీరోయిన్ హారర్ మూవీ - థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో భయపెట్టడం ఖాయం
Avatara Purusha 2 OTT:నా సామిరంగ ఫేమ్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ హారర్ మూవీ అవతార పురుష 2 ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Avatara Purusha 2 OTT: ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ అవతార పురుష 2 ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కన్నడ మూవీలో శరణ్ హీరోగా నటించాడు. సుని దర్శకత్వం వహించిన ఈ సాండల్‌వుడ్ మూవీలో తెలుగు యాక్టర్ సాయికుమార్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. 2022లో రిలీజైన అవతార పురుష మూవీకి సీక్వెల్‌గా అవతార పురుష తెరకెక్కింది.
సీక్వెల్‌కు మిక్స్‌డ్ టాక్...
మొదటి పార్ట్‌తో పాటు సీక్వెల్‌లో కూడా శరణ్, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా కనిపించడం గమనార్హం. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్‌గా నిలవగా సెకండ్ పార్ట్ మాత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. అవతార పురుష విజువల్స్, హారర్ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకుల్ని అలరించాయి.
అవతార పురుష 2 కథ ఇదే...
హిందూ పురాణాల నేపథ్యంలో దర్శకుడు సుని అవతార పురుష 2 కథను రాసుకున్నాడు. భూమికి స్వర్గానికి మధ్యనున్న త్రిశంకు లోకానికి చేరుకోవడానికి త్రిశంకు మణి వారధిగా ఉపయోగపడుతుంది. ఆ త్రిశంకు మణిని తమ సొంతం చేసుకోవాలని కొన్ని దుష్ట శక్తులను ప్రయత్నిస్తుంటాయి.
ఆ శక్తుల నుంచి త్రిశంకు మణిని అనిల అలియాస్ కర్ణ (శరణ్) ఎలా కాపాడాడు? ఈ ప్రయత్నంలో సిరి (ఆషికా రంగనాథ్) ఎలా అండగా నిలిచింది? ఈ మణిని సొంతం చేసుకోవడానికి దార్కా (అశుతోష్ రాణా) ఏం చేశాడు? దార్కా అతీంద్రియ శక్తులను ఎదురించే శక్తి సామర్థ్యాలు కర్ణకు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదే ఈ మూవీ కథ.
ఐదు కోట్ల కలెక్షన్స్...
కన్నడంలో ఈ ఏడాది భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ సీక్వెల్ డిసపాయింట్ చేసింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది అవతార పురుష 2తో హిట్ అందుకోవాలని ఆషికా రంగనాథ్ కలలు కన్నది. కానీ ఈ మూవీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. కన్నడంలో ఇప్పటివరకు 30కిపైగా సినిమాలు చేసిన ఆషికా రంగనాథ్.
అమిగోస్‌తో టాలీవుడ్ ఎంట్రీ...
కళ్యాణ్ అమిగోస్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. ఈ ఎక్స్‌పీరిమెంట్ మూవీలో రేడియో జాకీగా మోడ్రన్ గర్ల్ పాత్రలో క్యూట్ యాక్టింగ్‌తో అదరగొట్టింది. అమిగోస్ తర్వాత నా సామిరంగంలో నాగార్జునతో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నది.
నా సామిరంగలో…
నా సామిరంగలో పల్లెటూరి అమ్మాయిగా ఆషికా రంగనాథ్ కనిపించింది. సంక్రాంతికి థియేటర్లలోరిలీజైన ఈ మూవీ నలభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి విన్నర్‌లలో ఒకటిగా నిలిచింది. నా సామిరంగంలో నాగార్జునతో ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. మలయాళ మూవీ పురింజు మరియం జోస్ ఆధారంగా నా సామిరంగ మూవీని దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించాడు. నా సామిరంగ తర్వాత తెలుగులో మరో భారీ బడ్జెట్ మూవీకి ఆషికా రంగనాథ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.