నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో కల్యాణ్ రామ్‌కు తల్లిగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, ముప్పా వెంకట చౌదరి, కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించారు. అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీరాజ్, శ్రీరామ్, చరణ్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ గ్రాండ్ రిలీజ్ అయింది. సినిమా కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందని టాక్ వచ్చింది. అలాగే, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, నందమూరి కల్యాణ్ రామ్ ఫైటింగ్ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడని రివ్యూలు వచ్చాయి.
అలాగే, తల్లికొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.2 రేటింగ్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది.
నెల రోజులు గడవక ముందే ఇవాళ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, అది ఇండియాలో కాదు. కేవలం యూకే కంట్రీలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ రిలీజ్ అయింది. యూకే దేశంలోని అమెజాన్ ప్రైమ్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మరి ఇండియాలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవడానికి మరికొన్ని రోజులు పట్టనుందని తెలుస్తోంది. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే ఇది తల్లీకొడుకుల చుట్టూ జరుగుతుంది. తల్లి ప్రేమ కోసం పరితపించే కొడుకు, కుమారుడి చేసిన పనికి అసహ్యించుకునే తల్లి కథతో ఎమోషనల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతిని తెరకెక్కించారు.
మాజీ ఐపీఎస్ అధికారిణి వైజయంతి (విజయశాంతి) కుమారుడు అయిన అర్జున్ (నందమూరి కల్యాణ్ రామ్) విశాఖపట్నంలో గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. వైజాగ్‌లో అందరినీ శాసిస్తూ చక్రం తిప్పుతుంటాడు. కొడుకుపై అసహ్యంతో అర్జున్‌కు దూరంగా ఉంటుంది తల్లి వైజయంతి. కానీ, అర్జున్ మాత్రం తల్లితో కలిసి ఉండేందుకు తహతహలాడుతుంటాడు.
మరోవైపు వైజాగ్‌లో డ్రగ్స్ మాఫియా రన్ చేస్తున్న మహంకాళికి ఎదురు వెళ్తాడు అర్జున్. ఈ క్రమంలో అర్జున్ ఎదుర్కున్న పరిస్థితులు ఏంటీ? అర్జున్‌ను తల్లి వైజయంతి ఎందుకు దూరం పెట్టింది? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? తల్లిని అర్జున్ కలిశాడా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీని చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్