Arjun S/o Vyjayanthi Teaser: యాక్షన్, సెంటిమెంట్‍తో కల్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీజర్: చూసేయండి-arjun so vyjayanthi teaser releases kalyan ram in powerful role vijayashanthi as police officer action and sentiment ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Arjun S/o Vyjayanthi Teaser: యాక్షన్, సెంటిమెంట్‍తో కల్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీజర్: చూసేయండి

Arjun S/o Vyjayanthi Teaser: యాక్షన్, సెంటిమెంట్‍తో కల్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీజర్: చూసేయండి

Arjun S/o Vyjayanthi Teaser: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా టీజర్ వచ్చేసింది. కల్యామ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ పవర్‌ఫుల్‍గా ఉంది. డైలాగ్ అదిరిపోయింది.

Arjun S/o Vyjayanthi Teaser: యాక్షన్, సెంటిమెంట్‍తో కల్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీజర్: చూసేయండి

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం వస్తోంది. ఈ యాక్షన్ మూవీలో సీనియర్ నటి విజయశాంతి.. హీరోకు తల్లిపాత్ర పోషించారు. విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం నుంచి నేడు (మార్చి 17) టీజర్ వచ్చేసింది.

టీజర్ ఇలా..

పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా విజయశాంతి పవర్‌ఫుల్ గన్ షూటింగ్ సీన్‍తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ షురూ అయింది. “పది సంవత్సరాల కెరీర్లో ఎన్నో ఆపరేషన్స్. కానీ చావుకు ఎదురెళుతున్న ప్రతీసారి. నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్” అని వైజయంతి చెప్పే సెంటిమెంట్ డైలాగ్ ఉంది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ఎంట్రీ ఉంది. అర్జున్ (కల్యాణ్ రామ్) కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వైజయంతీ ఆశిస్తుంది. పోలీస్ అవకముందే నేరస్తుల అంతు చూస్తుంటాడు అర్జున్. ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.

“రేపటి నుంచి వైజాగ్‍ను పోలీస్ బూట్లు, నల్లకోట్లు కాదు. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి” అని అర్జున్ డైలగ్ ఉంది. తప్పు చేసిన ఎవరినైనా నేరం జరిగితే వదలనని వైజయంతి అంటుంది. పోలీస్ డ్రెస్ వేసుకోకుండానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే కొడుకు అర్జున్‍పై కూడా వైజయంతి యాక్షన్ తీసుకుంటారనేలా అర్థమవుతోంది. హ్యపీ బర్త్ డే అమ్మ అంటూ అర్జున్ కేక్ చూపించే సీన్‍తో ఈ టీజర్ ఎండ్ అయింది.

యాక్షన్, ఎమోషన్‍తో..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. పవర్‌ఫుల్ యాక్షన్‍తో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ బలంగా కనిపిస్తోంది. ఎమోషనల్‍గానూ ఉంది. ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను బలంగా రాసుకున్నట్టు కనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత ఐదేళ్ల అనంతరం మళ్లీ ఓ మూవీ చేస్తున్నారు విజయశాంతి. కర్తవ్యం లాంటి చిత్రాలతో ఒకప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే విజయశాంతి గుర్తొచ్చేవారు. అలాంటి ఆమె చాలా ఏళ్ల తర్వాత పోలీస్ రోల్ చేయడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీపై మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీకి అజ్నీష్ లోక్‍నాథ్ సంగీతం అందిస్తున్నారు. టీజర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సీతో ఉంది. ఈ మూవీలో సాయీ మంజ్రేకర్, శ్రీకాంత్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ పతాకాలపై అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలుసు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తామని టీమ్ వెల్లడించింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం