Por Movie: థియేటర్లలో హిట్ - అయినా నెలలోపే ఓటీటీలోకి వచ్చిన ఓజీ యాక్టర్ యాక్షన్ మూవీ
Por Movie: ఖైదీ ఫేమ్ అర్జున్‌దాస్ హీరోగా నటించిన తమిళ మూవీ పోర్ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Por Movie: లోకేష్ కనకరాజ్ సినిమాతో కోలీవుడ్‌లో పాపులర్ అయ్యాడు అర్జున్ దాస్. ఖైదీలో విలన్ గ్యాంగ్‌లో పనిచేసే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ రోల్‌లో మెప్పించాడు. ఆ తర్వాత విజయ్ మాస్టర్‌తో పాటు కమల్‌హాసన్ విక్రమ్‌లోనూ అర్జున్ దాస్ నటించాడు.
తమిళంతో పాటు హిందీలో...
ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోన్న అర్జున్ దాస్ మరోవైపు సోలో హీరోగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు. అతడు హీరోగా నటించిన తమిళ చిత్రం పోర్ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ మూవీ తెరకెక్కింది. తమిళ వెర్షన్‌లో అర్జున్ దాస్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హిందీ వెర్షన్‌లో హర్షవర్ధన్ రాణే, ఎహాన్ భట్ హీరోలుగా నటించారు. హిందీలో డంగే పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నెలలోపే...
మార్చి 1న థియేటర్లలో పోర్ మూవీ థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పోర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా పోర్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. తమిళంతో పాటు హిందీలో పోర్ స్ట్రీమింగ్ అవుతోంది.
కాలేజీ గొడవలతో...
కాలేజీ స్టూడెంట్స్ లవ్ స్టోరీస్, గొడవలు, సరదాలతో దర్శకుడు బిజోయ్ నంబియార్ పోర్ మూవీని తెరకెక్కించాడు. సీనియర్ స్టూడెంట్ ప్రభుతో(అర్జున్ దాస్) ఫ్రెషర్ యువ (కాళిదాస్ జయరామ్) గొడవ పడతాడు. వారి గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీసింది. కాలేజీ గొడవలకు కులరాజకీయాలతో ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. అర్జున్ దాస్ నటనకు ప్రశంసలు దక్కాయి.
పవన్ కళ్యాణ్ ఓజీలో..
తమిళంతో పాటు టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడు అర్జున్ దాస్. గోపీచంద్ ఆక్సిజన్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్. గత ఏడాది రిలీజైన బుట్టబొమ్మ సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో అర్జున్ దాస్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఓజీ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఓజీ మూవీ రిలీజ్ కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓజీ మూవీని నిర్మిస్తోంది.
తెలుగు నటుడు...
తెలుగు నటుడు అయిన హర్షవర్ధన్ రాణే టాలీవుడ్‌లో పలు సినిమాలు చేశాడు. తకిట తకిట, ప్రేమ ఇష్క్ కాదల్, అనామిక, అవును 2, ఫిదాతో పాటు చాలా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు షిప్టయ్యాడు హర్షవర్ధన్ రాణే.ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తున్నాడు హర్షవర్ధన్ రాణే.
బిజోయ్ నంబియార్ దర్శకుడిగా బాలీవుడ్‌తో పాటు తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేశాడు. కార్వాన్, సోలో, వజీర్ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.