తెలుగులో మరో స్పోర్ట్స్ బయోపిక్ చిత్రం "అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్" రానుంది. దానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీని గుబ్బల నిర్మాత. నటుడు విజయ రామరాజు, సిజా రోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్, దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. "అర్జున్ చక్రవర్తి" చిత్రం 1980లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో ఒక క్రీడాకారుడి జీవితంలోని కష్టాలను, విజయాలను సహజంగా కళ్లకు కట్టినట్టు చూపించనున్నారు. తాజాగా అర్జున్ చక్రవర్తి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో చేతిలో పతకంతో, ముఖంలో అనుకున్నది సాధించానన్న గర్వంతో కనిపించడం చూడవచ్చు. "భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది" అంటూ రాసిన అక్షరాలు హైలెట్ అయ్యాయి.
అలాగే అర్జున్ స్ఫూర్తిదాయకమైన కథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాకు విఘ్నేష్ బాస్కరన్ సంగీతం అందిస్తున్నారు. జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుమిత్ పటేల్ ఆర్ట్ డైరెక్షన్, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. "అర్జున్ చక్రవర్తి" మూవీ తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. దీన్ని హిందీ, మలయాళం, కన్నడ భాషలల్లో కూడా డబ్ చేస్తూ పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు.
టాపిక్